కౌశల్ 'సేనాని'

  • IndiaGlitz, [Saturday,January 12 2019]

రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 వివాదాల న‌డుమ విన్నర్‌గా నిలిచిన కౌశల్ మండ త్వరలోనే హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని విశ్వసనీయ వర్గాల సమాచారం. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ కాక ముందు కౌశ‌ల్ అంటే ఎవ‌రో పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. కానీ బిగ్‌బాస్‌లో విన్న‌ర్‌గా నిల‌వ‌డం కౌశ‌ల్‌కి మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.

కౌశల్ ఆర్మీ పేరుతో బిగ్‌బాస్ సీజన్ 2లో సెన్సేషన్ క్రియేట్ చేసి విజేత నిలిచిన కౌశల్‌ను, బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో నటింప చేయడానికి ప్రయత్నాలు జరిగాయనేది వాస్తవం. మ‌హేష్ 'మ‌హ‌ర్షి'లో కౌశ‌ల్ న‌టిస్తున్నాడ‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే హీరోగా కౌశల్ సినిమాలేవీ కమిట్ కాలేదు.

అందుకు కారణం.. వచ్చిన క్రేజ్‌తో హీరోగా ఎదగాలనుకున్నాడు కౌశల్. తాజా సమాచారం ప్రకారం మెగా హీరోలకు సన్నిహితుడైన నిర్మాత ఒకరు కౌశల్‌తో సినిమా చేయబతున్నారని.. కొత్త దర్శకుడితో చేయబోయే ఈ సినిమాకు ‘సేనాని’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని కూడా వార్తలు వినపడుతున్నాయి.

More News

ఈ నెల 21న జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే

ఏపీలో బీజేపీ పెద్ద షాక్ తగిలింది. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ బై.. బై చెప్పనున్నారు.

తిరుమల కొండపై వైసీపీ కార్యకర్తల ఓవరాక్షన్

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌ రెడ్డి పాదయాత్ర ముగించుకుని కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.

అలీకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయిపోయినట్లేనా!

టాలీవుడ్ నటుడు అలీకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయ్యిందా..? ఇటీవల ఓ మంత్రితో జరిగిన భేటీలో టికెట్ వ్యవహారం తేలిపోయిందా..?

ఈ నేతలందరికీ పవన్ టికెట్లిస్తారా..!?

యువతను ఆదరిస్తా..! యూత్ రాజకీయాల్లోకి రావాలి..! యువకులకు టికెట్లిచ్చి ప్రోత్సహిస్తా.. 60 శాతం యువకులకే టికెట్లు ఇస్తానంటున్న జనసేనాని అధినేత పవన్ కల్యాణ్.

అస‌లేం జ‌రిగింది? చిత్ర పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించిన ఎంపీ సంతోష్ కుమార్ 

ఎక్సోడ‌స్ మీడియా నిర్మిస్తున్న అస‌లేం జ‌రిగింది? చిత్రం పోస్ట‌ర్‌ను ఎంపీ సంతోష్ కుమార్  శ‌నివారం  జ‌రిగిన  కార్య‌క్ర‌మంలో ఆవిష్క‌రించారు.