నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత ఘన విజయం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొదటి రౌండ్‌ ఓట్ల లెక్కింపుతోనే కవిత విజయం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ 413 కాగా.. అంతకు మించి ఓట్లు కవితకు లభించాయి. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం.

మొత్తం 824 మంది ఓటర్లు ఉండ‌గా, 823 మంది ప్ర‌జాప్ర‌తినిథులు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. పోలైన 823 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 56, కాంగ్రెస్‌కు 29 పోల్ అవగా.. 10 ఓట్లు చెల్లలేదు. మరికాసేపట్లో ఆమె గెలుపునకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కవిత అందుకోనున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానానికి అక్టోబర్ 9న పోలింగ్ జరిగింది. ఒకరు మృతి చెందడంతో 823 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. క‌రోనా కార‌ణంగా ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిథులు పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా త‌మ ఓటును వినియోగించుకున్నారు. మొత్తం పోలైన 823 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు తొలి రౌండ్‌లోనే 542 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో డిపాజిట్ దక్కాంటే అభ్యర్థికి కనీసం 138 ఓట్లు పోలవ్వాలి. అయితే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు 29, 56 ఓట్లు మాత్రమే పోలవడంతో ఈ ఇరు పార్టీలకు డిపాజిట్ గల్లంతయ్యింది.

More News

‘ఆదిపురుష్’లో అజయ్ దేవగణ్ పాత్రపై క్లారిటి..!

ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు.

‘మహాసముద్రం’లో మధ్య తరగతి అమ్మాయిగా అదితి..

‘సమ్మోహనం’తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అదితిరావు హైదరీ మరో తెలుగు సినిమాలో కనిపించనుంది.

ఏపీ రాజకీయాల్లో పార్టీల పరిస్థితిపై పోలింగ్ ఏజెన్సీ సర్వే..

ఏపీ రాజకీయాల్లో పార్టీల పరిస్థితేంటి? అధికార పార్టీ ప్రభ తగ్గిందా? ప్రతిపక్ష పార్టీకి మద్దతు పెరిగిందా?

వీపుపై కొట్టండి.. దయచేసి కడుపుపై కొట్టకండి: బండ్ల గణేష్ ఆవేదన

2018 ఎన్నికల సమయంలో రాజకీయ ఆరంగేట్రం చేసిన నిర్మాత బండ్ల గణేష్.. అమాయకంగా మీడియాకు దొరికిపోయారు.

అదే రిపీట్ చేస్తున్న శేఖ‌ర్ క‌మ్ముల‌

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో శేఖ‌ర్ క‌మ్ములకు సెన్సిబుల్ డైరెక్ట‌ర్ అనే పేరుంది.