పవన్ ని ఆకాశానికెత్తేసిన కీర్తి

  • IndiaGlitz, [Tuesday,November 28 2017]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టిస్తున్న 25వ చిత్రం అజ్ఞాతవాసి'. ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ నిన్న కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వారణాసిలో ఆఖరి షెడ్యూల్ జరుపుకుంటోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో కీర్తి.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, “పవన్ సర్ తో కలిసి పని చేయడం ఎంతో సరదాగా, సంతోషంగా ఉంది. చూడడానికి చాలా సైలెంట్ గా ఉంటారు కానీ.. ఆఫ్ ది స్క్రీన్ ఆయన మంచి జోక్స్ వేసి అందరిని నవ్విస్తూ ఉంటారు. మంచి సెన్స్ ఆఫ్ హ్యుమర్ ఉన్న వ్యక్తి. ఒక కుటుంబంలా కలిసిపోయి ఈ సినిమాలో చాలా ఎంజాయ్ చేస్తూ పని చేసామని తెలిపారు. అలాగే తను చేసిన ఈ క్యారెక్టర్ ని చక్కగా డిజైన్ చేసారని.. త‌న పాత్ర‌లో మంచి కామెడీ ఉంద‌ని కీర్తి చెప్పుకొచ్చింది.

త్రివిక్ర‌మ్ రాసిన మాట‌ల‌ను ఎంజాయ్ చేస్తూ డ‌బ్బింగ్ చెప్పానని ఈ కేర‌ళ‌కుట్టి తెలిపింది. అనిరుద్‌ మ్యూజిక్ ని అందిస్తున్న ఈ సినిమా జనవరి 10న వెండితెర‌పై సంద‌డి చేయ‌నుంది.

More News

ప్రాజెక్ట్ z.. అడ్డంకులు తొలగిపోయాయి

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తమిళ చిత్రం ‘మాయవన్’. ఇదొక సైన్స్ ఫిక్షన్ క్రైమ్ మిస్టరీ ఫిలిం. దీనిని ‘ప్రాజెక్ట్ z’ అనే పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నారు.

అన్నయ్యని డైరెక్ట్ చేస్తానంటున్న తమ్ముడు

ఆవారా, నాపేరు శివ, ఊపిరి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు కార్తి. ‘ఖాకి’ సినిమా విజయంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు ఈ యువ కథానాయకుడు.

గ‌రుడ‌వేగ ఆర్టిస్ట్‌.. షార్ట్ ఫిల్మ్‌

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు యువ న‌టుడు ఆదర్శ్ బాలకృష్ణ.యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'లో రన్నర్ అప్ గా నిలిచాడు ఆద‌ర్శ్‌.

నాని 'ఎం సి ఎ' విడుదల తేదీ

డబుల్ హ్యాట్రిక్ హీరో.. నేచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు కాంబినేషన్లో రూపొందుతోన్నసినిమా 'ఎం.సి.ఎ'. దిల్రాజు 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు భానుమతిగా పరిచయమైన సాయిపల్లవి ఎం.సి.ఎలో హీరోయిన్గా నటించింది.

తెలుగులోకి మ‌రో హార‌ర్ చిత్రం..

తెలుగులో హార‌ర్ చిత్రాలు, హార‌ర్ కామెడీ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న త‌రుణంలో త‌మిళం నుండి తెలుగులోకి ఓ హార‌ర్ చిత్రం రానుంది. వ‌డివుడియాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'పొట్టు'.