close
Choose your channels

పవన్ ని ఆకాశానికెత్తేసిన కీర్తి

Tuesday, November 28, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టిస్తున్న 25వ చిత్రం అజ్ఞాతవాసి`. ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ నిన్న కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వారణాసిలో ఆఖరి షెడ్యూల్ జరుపుకుంటోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో కీర్తి.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, “పవన్ సర్ తో కలిసి పని చేయడం ఎంతో సరదాగా, సంతోషంగా ఉంది. చూడడానికి చాలా సైలెంట్ గా ఉంటారు కానీ.. ఆఫ్ ది స్క్రీన్ ఆయన మంచి జోక్స్ వేసి అందరిని నవ్విస్తూ ఉంటారు. మంచి సెన్స్ ఆఫ్ హ్యుమర్ ఉన్న వ్యక్తి. ఒక కుటుంబంలా కలిసిపోయి ఈ సినిమాలో చాలా ఎంజాయ్ చేస్తూ పని చేసామని తెలిపారు. అలాగే తను చేసిన ఈ క్యారెక్టర్ ని చక్కగా డిజైన్ చేసారని.. త‌న పాత్ర‌లో మంచి కామెడీ ఉంద‌ని కీర్తి చెప్పుకొచ్చింది.

త్రివిక్ర‌మ్ రాసిన మాట‌ల‌ను ఎంజాయ్ చేస్తూ డ‌బ్బింగ్ చెప్పానని ఈ కేర‌ళ‌కుట్టి తెలిపింది. అనిరుద్‌ మ్యూజిక్ ని అందిస్తున్న ఈ సినిమా జనవరి 10న వెండితెర‌పై సంద‌డి చేయ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.