close
Choose your channels

అన్నయ్యని డైరెక్ట్ చేస్తానంటున్న తమ్ముడు

Tuesday, November 28, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆవారా, నాపేరు శివ‌, ఊపిరి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు కార్తి. ఖాకి` సినిమా విజ‌యంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు ఈ యువ క‌థానాయ‌కుడు. ఈ సినిమా సక్సెస్ మీట్ సంద‌ర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు కార్తి.

తన ఫస్ట్ ఫిలిం పరుతివీరన్`లో నటించక ముందు కార్తి.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొంతకాలం పనిచేసారు. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన యువ` సినిమాకి కార్తినే అసిస్టెంట్ డైరెక్టర్. ఆ సినిమాలో కార్తి సోదరుడు సూర్య కూడా ఒక హీరోగా నటించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న ఆ రోజుల్లోనే తన డైరెక్షన్లో సూర్య కోసం ఒక స్క్రిప్ట్ అనుకున్నాడంట. కాని కొన్ని కారణాల వలన అది కార్యరూపం దాల్చలేకపోయింది. కాని ఏదో ఒక రోజు తన కల నిజమౌతుందని చెప్పాడు కార్తి.

ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు కార్తి. ఇది ఒక గ్రామీణ వాతావరణంలో సాగే ఎంటర్‌టైన‌ర్‌ ఫిలిం. ఈ మూవీలో సయేషా, ప్రియ భవాని శంకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.