close
Choose your channels

మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్న నిర్మాత‌

Tuesday, October 15, 2019 • తెలుగు Comments

మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్న నిర్మాత‌

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మించినా ఈయ‌న‌కు ల‌క్ క‌లిసి రావ‌డం లేదు. అయినా కూడా ఈయ‌న ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నాలు మాత్రం మాన‌డం లేదు. ఇటీవ‌ల సూర్య `ఎన్‌.జి.కె` సినిమాను తెలుగులో విడుద‌ల చేశారు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఇప్పుడు సూర్య సోద‌రుడు కార్తి తాజా చిత్రం `ఖైదీ` తెలుగు థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడు.

కార్తి హీరోగా లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోడ్రీమ్ వారియర్ పిక్చ‌ర్స్‌, వివేకానంద పిక్చ‌ర్స్ ప‌త‌కాల‌పై ఎస్‌.ఆర్‌.ప్ర‌భు, ఎస్‌.ఆర్‌.ప్ర‌కాష్ బాబు, తిరుపూర్ వివేక్ నిర్మించిన చిత్రం `ఖైదీ`. మెగాస్టార్ చిరంజీవిని స్టార్ హీరోగా నిల‌బెట్టిన చిత్రం `ఖైదీ` టైటిల్‌తోనే రూపొందిన ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత, శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహ‌న్ సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ సోమ‌వారం విడుద‌లైన గుడ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. శామ్ సి.ఎస్‌. సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కార్తి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో న‌రైన్‌, దీనా, మ‌రియం జార్జ్ త‌దితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

మ‌రి `ఖైదీ` సినిమాతో అయినా రాధామోహ‌న్ హిట్‌ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రంలో హీరోయిన్‌, సాంగ్స్‌లాంటి లేకుండా ద‌ర్శ‌కుడు లోకేష్ సినిమాను తెర‌కెక్కించాడు.

Get Breaking News Alerts From IndiaGlitz