close
Choose your channels

రీమేక్స్‌పై మ‌న‌సుప‌డుతున్న రామ్‌

Tuesday, October 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రీమేక్స్‌పై మ‌న‌సుప‌డుతున్న రామ్‌

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ ఏడాది `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వెంట‌నే రామ్ సినిమాలు చేసేయ‌కుండా.. కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అయితే మ‌రో ప‌క్క రామ్ కోసం ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఆ సినిమా ఏదో కాదు. త‌మిళ చిత్రం `త‌డం`. ఈ చిత్రాన్ని తెలుగులో రామ్ హీరోగా రీమేక్ చేయ‌బోతున్నారు. కాగా సినీ వ‌ర్గాల తాజా స‌మాచారం మేర‌కు రామ్ మ‌రో రీమేక్‌లో న‌టించ‌బోతున్నార‌ట‌.

వివ‌రాల్లోకెళ్తే.. ఈ ఏడాది మ‌ల‌యాళంలో విడుద‌లై విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో `ఇష్క్‌` ఒక‌టి. ఇదొక ల‌వ్ థ్రిల్ల‌ర్‌. ఈ సినిమాను E4 ఎంట‌ర్‌టైన్మెంట్స్, స‌వ్రంతి ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించ‌బోతున్నాయ‌ట‌. అయితే ముందుగా `త‌డ‌మ్‌` రీమేక్ సెట్స్ పైకి వెళుతుంద‌ట‌. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే మల‌యాళ రీమేక్ ప్రారంభం అవుతుంద‌ని టాక్‌. అయితే ఈ రెండు సినిమాల‌కు మాత్రం పెద్ద‌గా గ్యాప్ తీసుకోర‌ట‌. ఇప్ప‌టికే మ‌ల‌యాళ `ఇష్క్‌` రీమేక్‌కి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.