లగడపాటి రాజకీయమే కాదు.. ఇక పై సర్వే సన్యాసం కూడా!!

  • IndiaGlitz, [Friday,May 24 2019]

తెలంగాణ జరిగిన ముందస్తు ఎన్నికలు.. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేసిన ‘ఆర్జీప్లాష్’ టీమ్ సర్వే అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో తన సర్వే ప్లాప్ అయ్యిందేమో కానీ.. ఈసారి మాత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఈ ఎన్నికల్లో తాను చెప్పినట్లుగా టీడీపీ గెలవకపోతే సర్వేలు చేయనని చెప్పుకొచ్చారు.

అయితే ఆయన చేసిన సర్వే ఏపీలోనూ డబుల్ అట్టర్ ప్లాప్ అయ్యింది. వైసీపీ ఎవరూ ఊహించని.. కనివినీ ఎరుగని రీతిలో.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రికార్డులు సైతం బ్రేక్ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిస్టరీ క్రియేట్ చేశారు. అయితే లగడపాటి సర్వే అట్టర్ ప్లాప్ కావడంతో బెట్టింగ్ రాయుళ్లు, టీడీపీ నేతలు పలువురు రోడ్డున పడాల్సిన పరిస్థితి. అంతేకాదు లగడపాటి ఎక్కడైనా కనపడితే అడ్రస్ చెప్పండి అని.. పలువురు సోషల్ మీడియాలో.. టీవీ చానెళ్లలో పెద్ద ఎత్తున ఫొటోలు వైరల్ చేసిన సంగతి తెలిసిందే. పలు రకాలుగా లగడపాటిపై సెటైర్ల వర్షం కురిపించారు.

అయితే లగడపాటి సర్వే రెండోసారీ అట్టర్ ప్లాప్ కావడంపై స్పందించారు. ప్రస్తుతం మణిపాల్‌లో వేసవి విడిదికోసం వెళ్లిన ఆయన ఓ ప్రకటనలో క్షమాపణలు కోరారు. అంతేకాదు ముందుగా చెప్పినట్లుగానే ఇకపై సర్వేలు చేయనని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి తోడ్పడాలని లగడపాటి ఆకాంక్షించారు.

లగడపాటి ప్రకటన యథావిథిగా...

తెలంగాణ, ఏపీ శాసనసభ ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నాను. ఇందుకు కారణాలు ఏమైనా సరే వరుసగా రెండు సార్లు విఫలమయ్యాను. ఇకపై భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. 2014 లో కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఎంపీ పదవికి రాజీనామా చేశాను. ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నాను. అప్పటి నుంచి నేను ఏ పార్టీకీ అనుబంధంగా వ్యవహరించలేదు. 2004 నుంచి సర్వేలు నాకు ఒక వ్యాపకంగా మారాయి.

ప్రజల నాడి ఎవరికి అనుకూలమైనా లేదా వ్యతిరేకమైనా కూడా పక్షపాతం లేకుండా చెప్పాను. ఈ కోవలోనే ఏపీ, తెలంగాణలో కూడా మీడియా ద్వారా సర్వే వివరాలను ప్రజలకు వివరించాను. నా సర్వే ఫలితాల వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే మన్నించమని కోరుతున్నాను అని లగడపాటి ప్రకటనలో పేర్కొన్నారు. సో.. లగడపాటి ప్రకటనపై బెట్టింగ్ రాయుళ్లు, టీడీపీ అధినేత, తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

More News

సెన్సార్ పూర్తి చెసుకున్న "సువ‌ర్ణ‌సుంద‌రి" 

జ‌య‌ప్ర‌ద‌,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“.   సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు.

సుడిగాలి సుధీర్‌ హీరోగా 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' చిత్రం

జబర్దస్త్, ఢీ, పోవే పోరా వంటి సూపర్ హిట్ టెలివిజన్ షోస్ ద్వారా  ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌హీరోగా,'రాజు గారి గది' ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా

అఖిల్ అక్కినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, బ‌న్నివాసు ల చిత్రం ప్రారంభం

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 గా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో

‘గేమ్ ఓవర్’ సెన్సార్ పూర్తి జూన్ 14 న విడుదల

‘గేమ్ ఓవర్’ ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో  ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మిస్తున్న చిత్రం

ర‌కుల్ ఆ హీరోను పెళ్లి చేసుకునేద‌ట‌

ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళ చిత్రాల్లో స్టార్ హీరోల‌తో న‌టించి మెప్పించిన ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఈ అమ్మ‌డు బాలీవుడ్‌లో రాణించాల‌ని చాలా ఏళ్లుగా క‌ల‌లు కంటుంది.