గీతాంజలి మృతి ‘మా’కు తీరని లోటు!

  • IndiaGlitz, [Thursday,October 31 2019]

టాలీవుడ్‌ సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. తమ తోటి నటి ఇక లేరన్న విషయం తెలుసుకున్న టాలీవుడ్ పెద్దలు నిర్ఘాంతపోయారు. హైదరాబాద్‌లో ఉన్న పలువురు సీనియర్ నటీనటులు పెద్ద ఎత్తున అపోలో ఆస్పత్రికి చేరుకుని గీతాంజలి భౌతికకాయానికి నివాళులు అర్పించి.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతికి ‘మా’ అసోసియేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత, ఇతర కార్యవర్గ సభ్యులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ‘మా’ తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు.

‘మా’కు తీరని లోటు!

‘ఐదు దశాబ్దాలకు పైగా దక్షిణ భారత చలన చిత్ర సీమలో 300కు పైగా చిత్రాలలో నటించి కథానాయికగా, హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గీతాంజలి తనదైన ముద్రను వేశారు. నటిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఎంతోకాలంగా సేవలందిస్తున్నారు. ఆమె మృతి చిత్రసీమకే కాకుండా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు తీరని లోటు’ అని రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత, ఇతర కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గీతాంజలి మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

More News

టాలీవుడ్ సీనియర్ నటి గీతాంజలి ఇకలేరు

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు.

శివసేనకు బీజేపీ కొత్త బంపరాఫర్.. రాజీ కుదిరేనా!?

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై దాదాపు కొలిక్కి వచ్చేసినట్లేనని తెలుస్తోంది.

'భాస్కర్ ఒక రాస్కల్ ' గా వస్తున్న అరవింద స్వామి

అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో సిద్ధికీ తమిళంలో రూపొందిన భాస్కర్ ఓరు రాస్కల్  ఇప్పడు తెలుగులో భాస్కర్

బాలయ్య వియ్యంకుడికి షాకిచ్చిన వైఎస్ జగన్!

ఇదేంటి బాలయ్య పేరు ఎందుకొచ్చింది..? అసలు ఈ షాకులేంటి..? ఆయనెవరికో షాకిస్తే బాలయ్యకు ఏంటి సంబంధం అని మీరు అనుకుంటున్నారు కదూ..?

రామ్ `రెడ్` రిలీజ్ డేట్ ఫిక్స్‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం `రెడ్‌` నేడు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.