కేటీఆర్‌కు మ‌హేశ్ మ‌ద్ద‌తు

  • IndiaGlitz, [Wednesday,September 11 2019]

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ తెలంగాణ మున్సిప‌ల్ మినిష్ట‌ర్ కేటీఆర్‌కు మ‌ద్ద‌తుని తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న విష జ్వ‌రాల నివార‌ణ‌కు కేటీఆర్ కొన్ని సూచ‌న‌లు చేశారు. ఆ సూచ‌న‌ల‌ను పాటించాలంటూ మ‌హేశ్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా మ‌ద్ద‌తుని తెలియ‌జేశారు. ''హైద‌రాబాద్ న‌గ‌రాసులారా!..న‌గ‌రంలో డెంగ్యూ, వైర‌ల్ ఫీవ‌ర్ వ్యాప్తి చెందుతున్నాయి. మీ ప‌రిస‌రాల్లో నీటిని నిల్వ లేకుండా చూసుకోండి. అప్ర‌మ‌త్తంగా ఉండండి'' అన్నారు.

తెలంగాణ పుర‌పాల‌క శాఖామాత్యులు కేటీఆర్ ప్రస్తుతం ప్ర‌జ‌ల‌కు వ్యాపిస్త‌న్న డెంగ్యు, వైర‌ల్ ఫీవ‌ర్స్ గురించి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. దోమ‌ల కార‌ణంగా వైర‌ల్ ఫీవ‌ర్‌, డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందుతుంటే వాటి నివార‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను ఆయ‌న సూచించారు. ఇంటి ప‌రిస‌రాలు, నీటి తొట్టెలు, ఎయిర్ కూల‌ర్స్‌లో నీటిని నిల్వ ఉంచ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తాను ఆ ప‌నిచేసిన‌ట్లు చెప్పి కొన్ని ఫొటోల‌ను ఆయ‌న అప్‌లోడ్ చేశారు. ప్ర‌జ‌ల‌ను కూడా అలా నీటి నిల్వ‌లు లేకుండా చేసి ఫొటోల‌ను అప్‌లోడ్ చేయాల‌ని సూచించారు.

కేటీఆర్ చేసిన ప‌నికి ప్ర‌భాస్ ఫేస్‌బుక్ ద్వారా మ‌ద్దతు తెలియ‌జేస్తూ, ఆయ‌న నీటి నిల్వ లేకుండా చేసినప్ప‌టి ఫొటోను షేర్ చేశారు. అంతే కాకుండా ప్ర‌జ‌లు కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఇప్పుడు మ‌హేశ్ కూడా కేటీఆర్‌కు మ‌ద్ద‌తుని తెలియ‌జేశారు. ఇలా టాలీవుడ్‌కి చెందిన ఇద్ద‌రు అగ్ర‌హీరోలు కేటీఆర్ చేస్తున్న మంచి ప‌నికి త‌మ వంతు మ‌ద్దుతుని తెలియ‌జేశారు.

More News

చంద్రబాబుపై సుజనా షాకింగ్ కామెంట్స్!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ఒకప్పటి టీడీపీ ఎంపీ, ఆయనకు నమ్మకస్తుడైన సుజనా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘మా’లో గొడవలపై వివరణ ఇచ్చుకున్న కార్యవర్గం!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)లో గొడవలు జరుగుతున్నాయని.. ఒకరంటే ఒకరికి పడట్లేదని గత కొన్ని రోజులుగా మీడియా, సోష‌ల్ మీడియాలో

విజయ్ కాదు.. ప్రభాస్ హాట్‌గా కనిపిస్తారు! - పాయల్ రాజపుత్

ఆర్ఎక్స్-100 బ్యూటీ పాయల్ రాజపుత్.. యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌' చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు - నాని

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం)

విజ‌య్ 'బిగిల్‌' తెలుగు హక్కుల‌ను ద‌క్కించుకున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా `రాజా రాణి` ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా `బిగిల్‌`.