close
Choose your channels

‘మా’లో గొడవలపై వివరణ ఇచ్చుకున్న కార్యవర్గం!

Wednesday, September 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘మా’లో గొడవలపై వివరణ ఇచ్చుకున్న కార్యవర్గం!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)లో గొడవలు జరుగుతున్నాయని.. ఒకరంటే ఒకరికి పడట్లేదని గత కొన్ని రోజులుగా మీడియా, సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా.. ‘మా’ అధ్యక్షుడు న‌రేశ్‌కి రాజ‌శేఖ‌ర్ కార్యవ‌ర్గం నోటీసులు ఇవ్వబోతుందంటూ సోష‌ల్ మీడియాలో వార్తలు విన‌ప‌డుతున్నాయి. ఈ వ్యవహారంపూ కార్యవ‌ర్గం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చుకుంది. గొడవలు జరిగినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కార్యవర్గం ఖండించింది.

వివరణ ఇదీ..!

‘ఓ అసోసియేష‌న్ అంటే.. చాలా స‌మ‌స్యలుంటాయి. వాటన్నింటినీపై అంద‌రూ చ‌ర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ‘మా’ వెల్ఫేర్‌కి సంబంధించి అత్యవ‌స‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్యలు గురించి మంగ‌ళ‌వారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జ‌రిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు సంబంధించి మీడియాకు తెలియ‌జేయాల్సిన వార్తలేవైనా ఉంటే అధికారికంగా మేమే తెలియ‌జేస్తాం’ అని ‘మా’ కార్యవ‌ర్గం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.