close
Choose your channels

విజయ్ కాదు.. ప్రభాస్ హాట్‌గా కనిపిస్తారు! - పాయల్ రాజపుత్

Wednesday, September 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయ్ కాదు.. ప్రభాస్ హాట్‌గా కనిపిస్తారు! - పాయల్ రాజ్‌పూత్

ఆర్ఎక్స్-100 బ్యూటీ పాయల్ రాజపుత్.. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వరుస సినిమాలతో బిజిబిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ‘డిస్కోరాజా’, ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీమామ’లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఇందులో భాగంగా ప్రభాస్ .. విజయ్ దేవరకొండలలో మీకు ఎవరు ఎక్కువ హాట్‌గా అనిపిస్తారు..? ఎవరితో నటించాలని ఉంది..?  అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు పాయల్ బదులిస్తూ కాస్త డిఫరెంట్‌గా సమాధానం ఇచ్చింది. విజయ్‌ను పూర్తిగా పక్కనెట్టేసిన ఈ భామ ప్రభాస్ గురించి మాట్లాడింది.. అంటే విజయ్ హాట్‌గా ఉండడని పరోక్షంగా చెప్పిందన్న మాట.

పాయల్ మాటల్లోనే..!

‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టం. నిజంగా ఆయనలో ఏదో స్పార్క్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్  సహజంగా అనిపించే స్టైల్ అంటే మరింత ఇష్టం. అవకాశం వస్తే ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉంది’ అని పాయల్ తన మనసులోని మాట ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చింది. కాగా ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందని ఈ భామ చెప్పింది. మరి ప్రభాస్‌తో నటించాలని ఇంతగా తహతహలాడుతున్న ఈ హాట్ భామకు.. ఆయన సినిమాల్లో లేదా కనీసం ఐటెమ్ సాంగ్స్‌లో అయినా నటించే అవకాశం వస్తుందో లేదో మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.