ధనలక్ష్మి తలుపు తడితే సక్సెస్ పట్ల నిర్మాత ఆనందం

  • IndiaGlitz, [Tuesday,August 04 2015]

ధనరాజ్‌, మనోజ్‌నందం, అనిల్‌కళ్యాణ్‌, శ్రీముఖి, రణధీర్‌, సింధుతులాని, నాగబాబు, తాగుబోతు రమేష్‌లతోపాటు జబర్‌దస్త్‌ బ్యాచ్‌' నటించిన ధనలక్ష్మి తలుపు తడితే' జూలై 31న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో- భీమవరం టాకీస్‌ పతాకంపై సాయి అచ్యుత్‌ చిన్నారి దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

చాలా చిన్న చిత్రంగా విడుదలైన ధనలక్ష్మి తలుపు తడితే'.. చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించే దిశగా, విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుండడం ఎంతో సంతోషాన్నిస్తోందని అంటున్నారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ధనలక్ష్మి..' సాధిస్తున్న విజయం ఎందరికో స్ఫూర్తినిస్తోందని కూడా ఆయన అన్నారు.

కథ-కథనాలే హీరోహీరోయిన్లని నమ్మి తాము చేసిన ప్రయత్నం ఫలించడం పట్ల రామసత్యనారాయణ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధనలక్ష్మి..' ఇస్తున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిన్న సినిమాలు రూపొందుతాయని తుమ్మలపల్లి అన్నారు. ముఖ్యంగా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సాయి అచ్యుత్ కి చాలా మంచి పేరు వస్తోందని. పలువురు నిర్మాతలు ఆల్రెడీ అతనితో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన అన్నారు.

More News

కలెక్షన్ కింగ్ కి ఊరట...

కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ శ్రీ అవార్డు అందుకున్న మోహన్ బాబుకి అవార్డుతో పాటు కొన్ని అవాంతరాలు కూడా వచ్చాయి.

అవును పవన్ తోనా...?

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించిన ‘భజరంగీ భాయ్ జా’న్ చిత్రం కూడా సూపర్ సక్సెస్ కావడంతో విజయేంద్రప్రసాద్ కి మంచి గుర్తింపు లభించింది.

వరుణ్ తేజ్ - క్రిష్ కంచె ట్రైలర్ కి తేది ఫిక్సయింది...

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించిన చిత్రమే 'కంచె'.

డబ్బింగ్ పూర్తి చేసిన సమంత

‘ఐ’ చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్నత్తు కుల్ల’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

లారెన్స్ పెద్ద మనసు...

నటుడిగా,కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా బిజీగా ఉన్న రాఘవ లారెన్స్ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటున్నాడు.