close
Choose your channels

అవును పవన్ తోనా...?

Tuesday, August 4, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబలి` తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించిన భజరంగీ భాయ్ జా`న్ చిత్రం కూడా సూపర్ సక్సెస్ కావడంతో విజయేంద్రప్రసాద్ కి మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ కథను ముందుగా దక్షిణాది హీరోలకు ఆయన వినిపించినా వారు పట్టించుకోకపోవడం, సల్మాన్ ఖాన్ ముందుకు వచ్చి రాక్ లైన్ వెంకటేష్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం, సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం జరిగిపోయాయి.

అయితే ఇప్పుడు దక్షిణాది తారలు ఈ చిత్రాన్ని చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారని టాక్. ముఖ్యంగా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తారని వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందే..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.