సినిమాలకు మెగా హీరోయిన్ గుడ్ బై!!

  • IndiaGlitz, [Wednesday,July 10 2019]

మెగా ఫ్యామిలీ నుంచి క్రికెట్ టీమ్ లాగా చాలా మంది హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు.. మరికొందరు సక్సెస్ కావడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. మెగా హీరోలతో పాటు నాగేంద్రబాబు కుమార్తె నిహారిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఇంతవరకూ ఈమె ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ పడలేదు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తే.. ఆ సినిమానే అట్టర్ ప్లాప్ అవుతోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే మెగా హీరోలకు మాత్రం అచ్చొచ్చిన టాలీవుడ్.. మెగా డాటర్స్‌కు అచ్చిరాలేదన్న మాట. దీంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని నిహారిక డిసైడ్ అయిపోయిందట. ఈ షాకింగ్ నిర్ణయాన్ని తన కుటుంబ సభ్యులతో సైతం పంచుకుందట. అయితే నాగబాబు, వరుణ్ తేజ్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదట.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిహారిక అటు సినిమాలతో.. ఇటు వెబ్ సిరీస్‌లోనూ తన అదృష్టాన్ని పరిశీలించుకుంటోంది. సినిమాల్లో సక్సెస్ కాలేకపోయిన నిహారిక.. వెబ్ సిరీస్‌లో నటించడమే కాకుండా నిర్మిస్తుండటంతో మంచి అవకాశాలు వస్తుండటంతో ఇక దీనికే పరిమితం కావాలని భావిస్తున్నదట. సో.. నిహారికకు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో.. ఫిల్మ్‌నగర్‌లో గట్టిగానే వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమో వేచి చూడాల్సిందే మరి.

More News

నవ్యాంధ్ర రాజధానిని వైఎస్ జగన్ మార్చేస్తున్నారా..!?

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్చేస్తున్నారా..? సీఎం కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఇప్పటి వరకూ అందుకే రాజధాని గురించి ఇంత వరకూ మాట్లాడలేదా..?

చంద్రబాబుకు మరో షాక్.. కీలకనేత రాజీనామా!?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గడ్డుకాలం వచ్చి పడింది. పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో..?

హరీష్ కాళ్లు పట్టుకున్న మంత్రి.. నిజమా? అబద్దమా!?

అవును.. టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి కట్టప్పలా ఉంటున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

‘ఉబెర్’ హెలికాఫ్టర్లు వచ్చేశాయ్.. 8 నిమిషాలకు కేవలం..!

ప్రముఖ కార్ల అగ్రిగేటర్ సంస్థ ‘ఉబెర్’ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అతి తక్కువ కాలంలో తన వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసి ‘ఉబెర్’ సత్తా ఏంటో చూపించింది.

షాకింగ్: రోజాకు మంత్రి పదవి దక్కకుండా చేసింది ఆ ఇద్దరేనా!?

అవును మీరు వింటున్నది నిజమే.. వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్‌ రోజాకు మంత్రి రాకపోవడం వెనుక ఆ ఇద్దరే కారణమని తెలుస్తోంది.