close
Choose your channels

‘మెగా’ టాస్క్‌‌ను తమన్ ఎలా కంప్లీట్ చేస్తారో..?

Thursday, January 21, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘మెగా’ టాస్క్‌‌ను తమన్ ఎలా కంప్లీట్ చేస్తారో..?

ప్రస్తుతమున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌లో తమన్ టాప్‌లో ఉన్నారు. తాజాగా ఆయన అదిరిపోయే ఛాన్స్ కొట్టేశారు. ఇప్పటికే మెగా హీరోని అద్భుతంగా డీల్ చేసిన ఆయన ఇక మెగాస్టార్‌ చిరంజీవిని డీల్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. అంటే మెగాస్టార్ తదుపరి చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నారు. నాడు.. కాళ్లకు, కళ్లకు లింక్ పెట్టి రికార్డుల మీద రికార్డులు కొట్టేశారు. మరి ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో అవకాశం. ఏమాత్రం తగ్గకూడదు.. డిజప్పాయింట్ మెంట్ అనేది రాకూడదు. మెగాస్టార్ కంటే ముందు ఆయన అభిమానులను ఆకట్టుకోవాలి. మొత్తానికి తమన్‌కి ఇప్పుడిది చాలా పెద్ద టాస్క్. మరి ఈ టాస్క్‌ని ఆయన ఎలా కంప్లీట్ చేస్తారో చూడాలి.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘లూసిఫర్’ను చిరు హీరోగా రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సురేఖ కొణిదెల సమర్పణలో ఆర్‌.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. నిన్న ఉదయం ఫిల్మ్‌ నగర్‌లోని సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ కార్యాలయంలో మొదలైంది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌, అశ్వినీదత్‌, దానయ్య, నిరంజన్‌ రెడ్డి, నాగబాబు, కొరటాల శివ, సత్యానంద్‌, సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది.

ఈ కథను మన నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు మోహన్‌రాజా మార్పులు చేశారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అందునా చిరు చాలా ఇష్టపడి ఎంచుకున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తాజాగా దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ ‘‘మెగాస్టార్‌ కెరీర్‌లో ఇది మరో భిన్నమైన సినిమా. ‘లూసిఫర్‌’కు ఇది పూర్తిస్థాయి రీమేక్‌ కాదు. ఆ కథను తీసుకుని అందులో మెగాస్టార్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్చి, రూపొందిస్తున్నాం. మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.