'డర్టీ హరి' మొదటి పాట 'లెట్స్ మేక్ లవ్' పూర్తి వీడియో తో ఎం.ఎస్ రాజు మరో సర్ప్రైజ్!!

  • IndiaGlitz, [Wednesday,July 22 2020]

ఆద్యంతం రక్తికట్టించే సన్నివేశాలతో విడుదలైన కొన్నిగంటల్లోనే విపరీతమైన ఆదరణ పొంది 1 మిలియన్ కి పైగా వ్యూస్ సంపాదించడమే కాక యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది ఎం.ఎస్ రాజు 'డర్టీ హరి' ట్రైలర్.

ఈ సందర్భంగా ప్రేక్షకులని మరింత ఆకర్షించే విధంగా చిత్రంలోని మొదటి పాట 'లెట్స్ మేక్ లవ్'తో ఈ నెల 24 న మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు సమర్పకులు గూడూరు శివరామకృష్ణ, నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్.

సరికొత్త కథనంతో, యూత్ ని ఆకర్షించే కంటెంట్ తో హైదరాబాదీ కుర్రాడు శ్రవణ్ రెడ్డి ని డర్టీ హరి గా పరిచయం చేస్తూ సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ లని నాయికలుగా చూపిస్తూ నటుడు సునీల్ వాయిస్ ఓవర్ తో చాలా వినోదాత్మకంగా సాగే ట్రైలర్ కి ప్రముఖ దర్శకులు, నటులు మరియు మీడియా ప్రముఖులు ప్రశంసలందించారు.

నిర్మాతలు మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన మా డర్టీ హరి ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన లభించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులనుండి ప్రశంసలు లభించాయి. రొటీన్ కి భిన్నంగా ప్రయత్నిస్తున్న మా డైరెక్టర్ ఎం.ఎస్.రాజు గారు కథని మలిచిన విధానం యూత్ ని బాగా ఆకట్టుకోనుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. త్వరలోనే ఈ చిత్రంలోని మొదటి పాట 'లెట్స్ మేక్ లవ్' పూర్తి వీడియో తో ఈ నెల 24 న మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. మీ అందరికి కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం అన్నారు.

న‌టీన‌టులు; శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ, రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ ముఖ్య పాత్రలను పోషించారు.
 

More News

‘పవర్‌స్టార్’ ట్రైల‌ర్ లీక్డ్.. ఇంత‌కీ ట్రైల‌ర్‌లో ఏముంది

కేరాఫ్ కాంట్రవర్సీ మూవీస్ అంటూ ముందుకు సాగుతున్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ప్ర‌స్తుతం ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘ప‌వ‌ర్‌స్టార్‌’.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయన నిన్న ట్వీట్ చేశారు.

కుక్కలు ఎంత మొరిగినా.. మహా శిఖరం తలతిప్పి కూడా చూడదు: నిఖిల్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పవన్ కల్యాణ్‌ జీవిత కథను ‘పవర్ స్టార్’ అనే టైటిల్‌తో రూపొందించిన విషయం తెలిసిందే.

‘పవర్ స్టార్’ ట్రైలర్‌ లీక్.. మేమే బాధ్యత వహిస్తాం: వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

అవన్నీ రూమర్స్ మాత్రమే.. నాకంత ఆసక్తి లేదు: తరుణ్

బిగ్‌బాస్ అనగానే ఊహాగానాలు ప్రారంభమవుతాయి. ఒకరకంగా చెప్పాలంటే బిగ్‌బాస్ నిర్వాహకులకు ఈ ఊహాగానాలే కంటెస్టెంట్ల ఎంపికలో సాయపడతాయేమో అనిపిస్తుంది.