close
Choose your channels

‘పవర్‌స్టార్’ ట్రైల‌ర్ లీక్డ్.. ఇంత‌కీ ట్రైల‌ర్‌లో ఏముంది

Wednesday, July 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘పవర్‌స్టార్’ ట్రైల‌ర్ లీక్డ్.. ఇంత‌కీ ట్రైల‌ర్‌లో ఏముంది

కేరాఫ్ కాంట్రవర్సీ మూవీస్ అంటూ ముందుకు సాగుతున్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ప్ర‌స్తుతం ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘ప‌వ‌ర్‌స్టార్‌’. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను టార్గెట్ చేసిన ఆర్జీవీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ట్ర‌ల‌ర్‌ను విడుద‌ల చేయాల‌నుకుంటే.. వర్మ‌కు షాక్ త‌గిలింది. ట్రైల‌ర్ లీకైంది. దీంతో ఆర్జీవీ ట్రైల‌ర్‌ను త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. త‌న ట్రైల‌ర్‌ను చూడాల‌నుకుంటే రూ.25 ఇవ్వాల‌ని.. తొలిసారి ట్రైల‌ర్‌కు ఆర్జీవీ డ‌బ్బులు వ‌సూలు చేశారు. అయితే ఇప్పుడు ట్రైల‌ర్ లీక్ కావ‌డంతో ఆడ‌బ్బుల‌ను వాప‌స్ చేస్తాన‌ని వ‌ర్మ ట్వీట్ చేశారు.

ట్రైల‌ర్‌లో ఏముంది...

ఇంతకూ వ‌ర్మ ‘పవర్‌స్టార్’ ట్రైల‌ర్‌లో ఏం చెప్పారు? ఎన్నిక‌ల త‌ర్వాత క‌థ అని ముందుగానే చెప్పేసిన వ‌ర్మ.. ట్రైల‌ర్ ప్ర‌స్తావించిన అంశాల‌ను చూస్తే..నేరుగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఎక్క‌డా సంబోధించ‌కుండా ప్ర‌వ‌న్ క‌ల్యాణ్ అని సంభోధించాడు. అలాగే మెగాస్టార్ పాత్ర‌ధారిని కూడా ట్రైల‌ర్‌లో రివీల్ చేశాడు వ‌ర్మ‌. అంతే కాకుండా మెగాస్టార్ పాత్ర‌ధారి, ప్ర‌వ‌న్‌ను అస‌లు ప‌వ‌ర్‌స్టార్ ఇమేజ్ ఎవ‌రి వ‌ల్ల వ‌చ్చింద‌నే ప్ర‌శ్న‌ను సంధించ‌డం గ‌మ‌నార్హం. అలాగే త‌నకు సన్నిహితుడు, స్క్రిప్ట్ రాసిచ్చిన వ్య‌క్తి(త్రివిక్ర‌మ్‌ను పోలిని వ్య‌క్తి)ని కొట్ట‌డం, బండ్ల‌గ‌ణేశ్‌ను పోలిన వ్య‌క్తి వ‌చ్చి మీరు ఓడిపోతే వంద కొబ్బ‌రికాయలు కొడ‌తాన‌ని చెప్ప‌డం.. అలాగే రెండో భార్య ఫోన్ చేస్తే ర‌ష్య‌న్ అయిన‌ మూడో భార్య ప్ర‌శ్నించ‌డం అనే అంశాల‌తో సినిమా ర‌న్ అవుతుంద‌ని వ‌ర్మ చెప్ప‌క‌నే చెప్పేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos