యాక్షన్  సన్నివేశాల్లో నాగశౌర్య‌

  • IndiaGlitz, [Wednesday,July 31 2019]

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా ప్రొడ‌క్ష‌న్ నెం 3 రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాలో కాస్త ఎక్క‌వుగానే యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్న‌ట్లుగా యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్ట‌ర్స్ తెలుగులో మొద‌టిసారిగా నాగ‌శౌర్య సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం.

ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌లే వైజాగ్ లో ఈ సినిమాకి సంబంధించిన ఓ యాక్ష‌న్ సీన్ ని షూట్ చేస్తుండ‌గా నాగ‌శౌర్య కాలికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే పూర్తిగా గాయం నుంచి కోలుకోకుండానే నాగ‌శౌర్య మ‌ళ్లీ షూట్ లోకి జాయిన్ అవ్వ‌డం జ‌రిగింది. అన్బుఅరివు మాస్ట‌ర్స్ కి తెలుగులో ఇది మొద‌టి సినిమా కావ‌డంతో, యాక్ష‌న్ సన్నివేశాల్ని చాలా అద్భుతంగా కంపోజ్ చేస్తున్నార‌ని ద‌ర్శ‌కనిర్మాత‌లు చెబుతున్నారు. ఇక అలానే ఈ సినిమాలో క‌ట్ లేకుండా ఉండే 3 నిమిషాల నిడివిగ‌ల స‌న్నివేశాల్ని కూడా చిత్రీక‌రిస్తున్నామ‌ని,ఇవి ప్రేక్ష‌కుల‌కి ఓ స‌రికొత్త అనుభూతిని ఇస్తాయ‌ని యూనిట్ సభ్యులు తెలిపారు.

న‌టీన‌ట‌లు.. పోసానికృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, ప్రొయ‌ర‌మ‌ణ‌, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్క‌ర్

More News

కాకినాడ‌లో బ‌న్నీ యాక్ష‌న్‌

బ‌న్నీ 19వ చిత్రం `నాన్న నేను`(విన‌ప‌డుతున్న పేరు) త‌దుప‌రి షెడ్యూల్ కోసం కాకినాడ చేరుకుంది.

రాక్‌స్టార్‌తో పూరి

డాషింగ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న పూరి జ‌గ‌న్నాథ్ రీసెంట్‌గా `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హిట్ కొట్టాడు. ఇప్పుడు త‌దుప‌రి సినిమాకు రెఢీ అవుతున్నాడ‌ని స‌మాచారం.

ఆస‌క్తిక‌ర‌మైన బ్యాక్‌డ్రాప్‌లో మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి.

'కొబ్బ‌రి మ‌ట్ట' ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్

హృద‌య‌కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో, కాలేయం లో త‌న స్థానాన్ని టెంట్ వేసుకుని ప‌డుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో

'రాక్ష‌సుడు' తో మ‌ళ్లీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌

యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా `రైడ్‌`, `వీర` చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో