close
Choose your channels

రాక్‌స్టార్‌తో పూరి

Wednesday, July 31, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాక్‌స్టార్‌తో పూరి

డాషింగ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న పూరి జ‌గ‌న్నాథ్ రీసెంట్‌గా `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హిట్ కొట్టాడు. ఇప్పుడు త‌దుప‌రి సినిమాకు రెఢీ అవుతున్నాడ‌ని స‌మాచారం. వివ‌రాల ప్ర‌కారం పూరి `జ‌న‌గ‌ణ‌మ‌న‌` స్క్రిప్ట్‌ను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని టాక్‌. నిజానికి ఈ స్క్రిప్ట్‌ను మ‌హేశ్‌తో డైరెక్ట్ చేయాల్సింది. కానీ మ‌హేశ్ ఎందుక‌నో ఆస‌క్తి చూప‌లేదు. పూరి చాలా రోజులు వెయిట్ చేసిన మ‌హేశ్ నుండి రెస్పాన్స్ రాలేదు.

దాంతో పూరి క‌న్న‌డ రాక్‌స్టార్ య‌ష్‌తో ఈ సినిమా క‌థ‌ను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. `కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1`తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుపరిచితుడైన య‌ష్, ఇప్పుడు పూరితో సినిమా అంటే ఇటు తెలుగు, అటు క‌న్న‌డ‌లోనూ సినిమా రూపొందే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.