close
Choose your channels

‘‘అన్నయ్య మా కుటుంబాలకు పిల్లర్ వంటి వారు’’... రమేశ్ బాబు మృతిపై నమ్రత ఎమోషనల్

Sunday, January 9, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్‌‌స్టార్ కృష్ణ కుమారుడు రమేష్ బాబు నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శనివారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కన్నుమూశారు. రమేష్ మరణవార్తతో కృష్ణ ఫ్యామిలీ దిగ్బ్రాంతికి గురైనది. సినీ పరిశ్రమలోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు సినీ ప్రముఖులు, మహేశ్ అభిమానులు రమేశ్ బాబు మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

అయితే అన్నయ్యను చివరిసారిగా కూడా చూసుకోలేకపోయారు మహేష్ బాబు. ఆయన కొద్దిరోజుల క్రితం కోవిడ్ బారినపడటంతో ఐసోలేషన్‌లో వుంటున్నారు. తనకు అన్నయ్యే సర్వస్వమని.. వచ్చే జన్మలోనూ ఆయనే తనకు అన్నయ్య అని మహేశ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 'నువ్వే నాకు స్ఫూర్తి.. నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం.. నాకంతా నువ్వే.. నువ్ లేకుంటే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. నువ్ నాకోసం చేసిన అన్నింటికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీస్కో.. ఈ జీవితంలోనే కాదు.. నాకు మరో జీవితం ఉంటే అప్పటికీ నువ్వే నా అన్నయ్య.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ మహేశ్ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

రమేష్ బాబుతో మహేష్ బాబుకి మంచి అనుబంధం ఉండేది. అన్నయ్యగా కంటే తండ్రిగా మహేష్ బాబుని అపురూపంగా చూసుకునేవారు రమేష్ . కృష్ణ సినిమాలతో బిజీగా ఉండడంతో.. మహేష్ బాధ్యతలను రమేష్ చేపట్టారు. ఆ క్రమంలోనే రమేశ్‌ అంటే మహేష్ కి అమితమైన ప్రేమ. తనకు ఎలాంటి ఇబ్బంది వున్నా అన్నయ్య దగ్గరకే వెళ్లేవారు ..అలాంటి వ్యక్తిని కోల్పోవడం మహేష్‌కి వ్యక్తిగతంగా ఎప్పటికీ తీరని లోటు.

అటు మహేష్ సతీమణి నమ్రత కూడా రమేష్ బాబు మృతితో విషాదంలో కూరుకుపోయారు. ఆయన భౌతికంగా దూరమైనా.. ఎప్పటికీ తమ గుండెల్లోనే ఉంటారని.. మా కుటుంబాలకు రమేశ్ బాబు పిల్లర్ లాంటి వారు అని చెప్పుకొచ్చారు. ఆయన మాకు నేర్పిన జీవిత పాఠాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని .. అన్నయ్య మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటామని నమ్రత పోస్ట్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.