నాని.. ఫిబ్రవరి సందడి

  • IndiaGlitz, [Saturday,November 25 2017]

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస విజ‌యాల‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు. మ‌రోవైపు చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న ఎం.సి.ఎ, కృష్ణార్జున యుద్ధం చిత్రాలు రెండు నెల‌ల గ్యాప్‌లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

డిసెంబ‌ర్‌లో ఎం.సి.ఎ రిలీజ్ కానుండ‌గా.. ఫిబ్ర‌వ‌రిలో కృష్ణార్జున యుద్ధం విడుద‌లకు సిద్ధ‌మౌతోంది. ఫిబ్ర‌వ‌రి నానికి బాగా క‌లిసొచ్చిన నెల అనే చెప్పాలి. 2016లో కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌, 2017లో నేను లోక‌ల్ చిత్రాలు ఈ నెల‌లోనే వ‌చ్చి విజ‌యం సాధించాయి కూడా. 2018లో కృష్ణార్జున యుద్ధంతో అదే నెల‌లో రానున్నారు నాని.

అంతేకాకుండా.. తాను నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అ! చిత్రాన్ని కూడా అదే ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక వేసుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ని కూడా శ‌నివారం విడుద‌ల చేసారు. నిత్యా మీన‌న్‌, కాజ‌ల్‌, రెజీనా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ర‌వితేజతో పాటు నాని కూడా వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు.

మొత్త‌మ్మీద‌.. ఫిబ్ర‌వ‌రిలో హీరోగా కృష్ణార్జున యుద్ధం.. నిర్మాత‌గా అ!తో బాగానే సంద‌డి చేయ‌నున్నారు ఈ నేచుర‌ల్ స్టార్‌.

More News

రామ్ చరణ్ చేతుల మీదుగా 'సప్తగిరి ఎల్ఎల్ బి' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్ప్రెస్' వంటి సూపర్హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ అధినేత డా.రవికిరణ్ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్ఎల్బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

'అనగనగా ఓ ప్రేమకథ' ప్రారంభం

కె. ఎల్.ఎన్ రాజు నిర్మాతగా.. థంజౌడ్ లైట్స్ మీడియా ప్రై.లి బ్యానర్పై కొత్త చిత్రం 'అనగనగా ఓ ప్రేమకథ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పదేళ్ల తరువాత.. పవర్ స్టార్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

'ప్రేమదేశం' టైటిల్ వినగానే టీనేజీ గుర్తొచ్చింది - డైరెక్టర్ బాబి

శ్రీ మారుతి ఆర్ట్ క్రియేషన్స్ - సిరి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ప్రేమదేశం`. స్రవంతి శ్రీధర్ నిర్మాత. శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహిస్తున్నారు.

అప్పుడు వెంకటేష్.. ఇప్పుడు నితిన్

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన శతమానం భవతి ఘనవిజయం సాధించింది. సక్సెస్తో పాటు ఎన్నో అవార్డులను మూటగట్టుకుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సతీష్ వేగెశ్న..