close
Choose your channels

అప్పుడు వెంకటేష్.. ఇప్పుడు నితిన్

Saturday, November 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన శ‌త‌మానం భ‌వ‌తి ఘ‌న‌విజ‌యం సాధించింది. స‌క్సెస్‌తో పాటు ఎన్నో అవార్డుల‌ను మూట‌గ‌ట్టుకుంది. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న స‌తీష్ వేగెశ్న‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని శ్రీ‌నివాస క‌ళ్యాణం పేరుతో తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమా కోసం ప‌లువురు అగ్ర క‌థానాయ‌కుల పేర్లు వినిపించాయి. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల అవి వ‌ర్క‌వుట్ కాలేదు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాకి హీరో ఓకే అయ్యాడు. అత‌నే.. యువ క‌థానాయ‌కుడు నితిన్‌.

శ్రీ‌నివాస క‌ళ్యాణంలో నితిన్ హీరోగా న‌టించ‌నున్నాడ‌ని ఈ మ‌ధ్యే వార్త‌లు వినిపించాయి. అయితే.. ఈ రోజు నితిన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ విష‌యాన్ని అధికారికంగా ధ్రువీక‌రించాడు. దిల్ రాజు నిర్మాణంలో 14 ఏళ్ల త‌రువాత శ్రీ‌నివాస క‌ళ్యాణం చేస్తున్నాన‌ని.. స‌తీష్ వేగెశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రానికి మిక్కీ జే.మేయ‌ర్ సంగీత‌మందించ‌నున్నాడ‌ని చెప్పుకొచ్చాడు. అలాగే మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని పేర్కొన్నాడు నితిన్‌.

30 ఏళ్ల క్రితం వ‌చ్చిన వెంక‌టేష్ శ్రీ‌నివాస క‌ళ్యాణం మంచి విజ‌యం సాధించింది. వెంకీ టైటిల్‌తో వ‌స్తున్న ఈ నితిన్ సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.