close
Choose your channels

పదేళ్ల తరువాత.. పవర్ స్టార్ ?

Saturday, November 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్ర‌స్తుతం త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అజ్ఞాత‌వాసి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మ‌రో రెండు రోజుల్లో.. ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ షెడ్యూల్ కోసం వారణాసి బయలుదేరనుంది చిత్ర యూనిట్. ఈ సినిమా పూర్తయిన తరువాత పవన్ పూర్తిగా పాలిటిక్స్, తన పార్టీ కార్యకలాపాల మీదే దృష్టి పెట్టే అవకాశాలే ఎక్కువ.

ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్‌లో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇంత‌కి అదేమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి`లో పవన్ ఒక పాత్ర చేయబోతున్నార‌న్న‌ది.అది కేవ‌లం 10నిమిషాల నిడివిగల పాత్ర అని.. అయితే చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని స‌మాచార‌మ్‌. ఈ విషయమై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి సమాచారం బయటకి రాలేదు. ఇదే నిజమైతే అన్నదమ్ములిద్దర్ని మళ్ళీ పది సంవత్సరాల తర్వాత.. వెండితెరపై చూసే అవ‌కాశం మెగా ఫాన్స్ కి కలుగుతున్న‌ట్టే.

వీరిద్ద‌రు.. 2007లో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్` సినిమాలో చివ‌రి సారిగా క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.