అందులో నిజం లేద‌న్న నాని

  • IndiaGlitz, [Sunday,June 02 2019]

'అబ్బాయిలూ అందులో నిజం లేదు' అని అన్నారు నాని. ఇంత‌కీ నాని చెప్పింది ఏ సంగ‌తి? అనేగా మీ ఆలోచ‌న‌. ఆయ‌న చేయ‌బోతున్నారంటూ వ‌స్తున్న ఓ సినిమా వార్త‌లో నిజం లేద‌ని నాని ట్విట్ట‌ర్ వేదిక‌గా చెప్పారు. ఆ సినిమా పేరు 'కూచిపూడివారి వీధి'. హీరోగా నాని, ద‌ర్శ‌కుడిగా శ్రీకాంత్ అడ్డాల క‌లిసి ఈ సినిమా కోసం ప‌నిచేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వాటిలో ఏ మాత్రం నిజం లేద‌ని నాని అన్నారు.

ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించ‌బోతున్న‌ట్టు కూడా ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. ఈ వార్త నిజం కాద‌న‌డంతో అభిమానులు కాసింత నిరాశ‌చెందిన‌ట్టు అర్థమ‌వుతోంది. పుకారుగానే వ‌చ్చిన‌ప్ప‌టికీ 'కూచిపూడివారి వీధి' అనే టైటిల్ మాత్రం బావుంద‌ని, నాని ఫ‌ర్ద‌ర్‌గా ఆ టైటిల్‌ను వాడుకోవ‌చ్చ‌ని కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా కొంత‌మంది స‌ల‌హాలిచ్చారు.

More News

పోసానికి ఆపరేషన్.. వైసీపీ నేతల పరామర్శ

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజకీయ విమర్శకుడు పోసాని కృష్ణ మురళి కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పదవి లేదా!?

వైఎస్ జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పదవి లేదా..? అసలు డిప్యూటీ సీఎం పదవి అనేది వద్దని జగన్ ఫిక్స్ అయ్యారా..?

వైఎస్‌కు భారతరత్న ఇవ్వాలని వైసీపీ డిమాండ్!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాల రూపకల్పన చేసి..

హ‌రీష్ శంక‌ర్ క్లారిటీ

చిన్న సినిమాల వేడుక‌ల‌కు  పెద్ద స్టార్లు హాజ‌రైతే ప్ర‌మోష‌న్ వ‌స్తుంది. తాజాగా `ఎర్ర‌చీర‌` చిత్ర బృందం కూడా అలాంటి ప్ర‌మోష‌న్ కోస‌మే ఎదురుచూసింది.

కాజ‌ల్ ఉన్న‌ట్టా?  లేన‌ట్టా?

నిన్న‌టికి నిన్న మేక‌ప్ గురించి కామెంట్ చేసి, బోల్డ్ గా ఫొటోలు పెట్టిన కాజ‌ల్ పేరు ఇవాళ ఇంకో రీజ‌న్‌తో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.