close
Choose your channels

ఫ్యాన్సీ రేటుకు నాని `వి`సినిమా శాటిలైట్ హ‌క్కులు

Saturday, October 19, 2019 • తెలుగు Comments

ఫ్యాన్సీ రేటుకు నాని `వి`సినిమా శాటిలైట్ హ‌క్కులు

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న చిత్రం `వి`. దిల్‌రాజు నిర్మాణంలో ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌కుడిగా ఈ సినిమాను తెర‌కెక్కుతుంది. క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ఫ్యాన్సీ ఆఫ‌ర్‌లో శాటిలైట్ హ‌క్కులు అమ్ముడ‌య్యాయి. వివ‌రాల ప్ర‌కారం జెమినీ టీవీ ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంద‌ట‌. అల వైకుంఠ‌పుర‌ములో, స‌రిలేరునీకెవ్వ‌రు, రూల‌ర్ చిత్రాల శాటిలైట్ హ‌క్కుల‌ను రీసెంట్‌గా సొంతం చేసుకున్న జెమినీ టీవీ రీసెంట్‌గా నాని `వి` శాటిలైట్ హ‌క్కుల‌ను కూడా ద‌క్కించుకుంది.

నాని న‌టిస్తోన్న 25వ చిత్ర‌మిది. ఈ సినిమాలో నాని నెగ‌టివ్ రోల్‌లో న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అలాగే మ‌రో హీరో సుధీర్ బాబు ఈ చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. నానిని హీరోగా తెలుగు ప‌రిచ‌యం చేసిన ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీయే కాదు.. నాని కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీ అనే చెప్పాలి. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌లకు సంబంధించిన వార్త‌ల‌పై ఓ క్లారిటీ రానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz