PSPK with NBK : పిస్తోల్‌తో కాల్చుకోవాలనుకున్నా.. మూడు పెళ్లిళ్లపై ఏం చెప్పారంటే : ఫ్యాన్స్‌ని సస్పెన్స్‌లో పెట్టిన పవన్


Send us your feedback to audioarticles@vaarta.com


నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ 2’ విజయవంతంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ మొత్తంలోనే ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓ ఎపిసోడ్ వుంది. అదే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్. సహజంగా పవన్ కల్యాణ్ ఇలాంటి షోలకు రారు. సినిమాలు, రాజకీయాలతో ఆయన క్షణం తీరిక లేకుండా వుంటున్నారు. ఈ సంగతి పక్కనబెడితే.. మాస్ ఇమేజ్ కలిగిన నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లను ఒకే వేదికపై చూడాలని ఎంతోమంది కల. అలాంటిది ఇద్దరు సూపర్స్టార్లు సింగిల్ ఫ్రేమ్‌లో కనిపిస్తుంటే.. మనకోసం బోల్డెన్నీ కబుర్లు చెబుతుంటే ఎవరికి మాత్రం వద్దు చెప్పండి. అందుకే పవన్ ఎపిసోడ్ కోసం జనం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. దీనికి మరింత హైప్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆహా టీమ్ కూడా వరుస ప్రోమోలు కట్ చేస్తోంది.
ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా పవన్‌కు బాలయ్య వెల్కమ్ :
దీనిలో భాగంగా పవన్ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా అంటూ పవన్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు బాలయ్య. దీనికి పవన్ సైతం నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు అంటూ బాలయ్య రెగ్యులర్‌గా అన్‌స్టాపబుల్ షోలో చెప్పే డైలాగ్‌ను పేల్చారు. తర్వాత పవన్ సినిమాల సంగతులను, వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు సంధించారు బాలకృష్ణ.
త్రివిక్రమ్‌తో ఫ్రెండ్ కావాల్సి వచ్చింది :
గుడుండా శంకర్‌లో ప్యాంట్ మీద ప్యాంట్ వేశావు.. అలా చేసి పాతిక సంవత్సరాలు వయసు తగ్గావు తెలుసా అంటూ బాలయ్య అన్నారు. అలాగే మనిద్దరి మధ్య తొలి పరిచయం అంటూ సుస్వాగతం సినిమా ఓపెనింగ్ నాటి ఫోటోను స్క్రీన్‌పై చూపించారు. అప్పుడు నేను యంగ్‌గా వున్నానంటూ బాలయ్య అనగా.. ఇప్పుడు అలాగే వున్నారంటూ పవన్ ప్రశంసించారు. తర్వాత త్రివిక్రమ్‌తో ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందన్న ప్రశ్నకు.. ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చిందండీ అంటూ పవన్ ఆన్సర్ ఇచ్చారు.
రామ్‌చరణ్‌కి ఫోన్ చేసిన బాలయ్య :
రామ్‌చరణ్ నీకు అంత క్లోజ్ ఎలా అయ్యాడంటే.. నాకు చిన్నప్పుడు వీళ్లను చూసుకోవాల్సిన డ్యూటీ వుండేదని పవన్ చెప్పాడు. మధ్యలో నాగబాబు వున్నాడు కదా అని బాలయ్య అంటే.. ఆయన నిర్మాత కాబట్టి తాను దొరికిపోయేవాడినని పవన్ ఆన్సన్ ఇచ్చాడు. ఆ వెంటనే రామ్‌చరణ్‌కు ఫోన్ చేసి.. ఏమయ్యా ఫిటింగ్ మాస్టారూ.. మొన్న ప్రభాస్ గురించి ఫోన్ చేస్తే , నీ గుడ్‌న్యూస్ మింగేసి అతని న్యూస్ చెప్పావంటూ బాలయ్య సెటైర్లు వేశాడు.
పంచె కట్టుతో ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్:
తర్వాత షోలోకి పవన్ మేనల్లుడు , హీరో సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఏంటమ్మా పెళ్లి చూపులకు వచ్చినట్లు పంచె కట్టుకుని వచ్చావని బాలయ్య ప్రశ్నించగా.. అమ్మాయిలను ఎలా గౌరవించాలో కూడా ఆయనే నేర్పారని తన మావయ్య గురించి గొప్పగా చెప్పాడు తేజూ. ఆ వెంటనే తొడ కొట్టి వెళ్లిపో అని సాయిని కోరగా.. తేజూ బాలయ్య దగ్గరకు వెళ్లాడు. దీంతో నా తొడ కాదమ్మా నీ తొడ కొట్టాలన్నారు.
మూడు పెళ్లిళ్లపై ప్రశ్న వేసిన బాలయ్య :
ఇక.. పవన్ జీవితంలోనే అత్యంత వివాదాస్పదంగా నిలిచిన మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై బాలయ్య ప్రశ్నలు సంధించగా.. దీనికి పవన్ ఏం చెప్పారన్న దానిపై సస్పెన్స్‌లో పెట్టారు. తన విజ్ఞత, సంస్కారం మాట్లాడుకుండా ఆపేస్తోందని పవన్ చెప్పారు. జీవితంలో ఇంతటి సంఘర్షణకు గురైన వ్యక్తి పవర్‌స్టార్ ఎలా అయ్యాడని బాలయ్య ప్రశ్నించాడు. ఒకానొక సమయంలో అన్నయ్య రూమ్‌కి వెళ్లి పిస్టోల్‌తో పేల్చుకుని చనిపోవాలని అనుకున్నట్లు పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా సస్పెన్స్‌లు, సరదా ముచ్చట్లతో పవన్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రసారం చేయనుంది ఆహా టీమ్. ఫస్ట్ పార్ట్‌ని ఫిబ్రవరి 3న ప్రసారం చేయబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.