'నేత్ర' మూవి ఫస్ట్‌లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
బివిఎస్ఆర్ క్రియేషన్స్, మీజా ఎంటర్టైన్మెంట్స్ బేనర్స్‌పై బి.వి సుబ్బారెడ్డి నిర్మాతగా హుస్సేన్(ఎ.ఎండి) దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'నేత్ర'. లతా సంగరాజు,గీతా సింగ్, బద్రం, కేదార్‌శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కి సిద్దంగా ఉంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ' మా ' అధ్యక్షుడు డా. నరేష్ , నటుడు శివబాలాజీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా...
చిత్ర దర్శకుడు హుస్సేన్ (ఎ.ఎండి) మాట్లాడుతూ ... ముందుగా మా చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన నరేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 'నేత్ర' ఒక సస్పెన్స్ థ్రిల్లర్. టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. లతా సంగరాజు, గీతా సింగ్, బద్రం ఇలా ప్రతి ఒక్కరూ వారి క్యారెక్టర్ లో చాలా బాగా నటించారు. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. రఘునాథన్ సినిమాటోగ్రఫి, రాజ్‌కిరణ్ మ్యూజిక్ సినిమాకు మంచి అసెట్ అయ్యాయి. మా నిర్మాత సుబ్బారెడ్డి గారు సినిమాపై ఎంతో ఫ్యాషన్ తో మాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. ప్రస్తుతం సెన్సార్ కి సిద్దంగా ఉంది. త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విడుదల తేదిని ప్రకటిస్తాం" అన్నారు.
లతా సంగరాజు,గీతా సింగ్, బద్రం, కేదార్‌శంకర్, సంద్యా జానక్, ఆర్యన్, కృష్ణ, హన్సిత, నిట్టల, స్యరూప తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.