close
Choose your channels

'నిన్నే కోరుకుంటా' ఆడియో విడుదల

Saturday, January 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సందీప్, విజ‌య్‌భాస్క‌ర్‌, ఆనంద్‌, పూజిత‌, సారిక పావ‌ని హీరో హీరోయిన్లుగా శుభ‌క‌రి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గ‌ణ‌ముర‌ళి శ‌ర‌గ‌డం ద‌ర్శ‌క‌త్వంలో మ‌రిపి విద్యాసాగ‌ర్‌(విన‌య్‌) నిర్మిస్తున్న చిత్రం నిన్నే కోరుకుంటా. ప్ర‌ణ‌వ్ మ్యూజిక్ అందించిన ఈసినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం విడుద‌లైంది. కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన తూరుపు జ‌గ్గారెడ్డి బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

తూరుపు జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ ``నిన్నే కోరుకుంటా పాట‌లు బావున్నాయి. సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

మ‌ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ ``పాట‌లు బావున్నాయి. ఈ సినిమాలో న‌టించిన విజ‌య్‌భాస్క‌ర్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా త‌నతోపాటు ఇందులో న‌టించిన వారంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి. నిర్మాత మ‌రిన్ని సినిమాలు చేయాలి`` అన్నారు.

దేవిప్ర‌సాద్ మాట్లాడుతూ ``పాట‌లు, సినిమా పెద్ద హిట్ సాధించాలి. ప్ర‌ణ‌వ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చిన్న సినిమాగా విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం పెద్ద విజ‌యాన్ని సాధించాలి`` అన్నారు.

విజ‌య్ భాస్క‌ర్ మాట్లాడుతూ ``గుడ్ టైటిల్‌. టైటిల్ విన్న‌వాళ్ళంద‌రూ బాగుంద‌నే అన్నారు. ముగ్గురు యువ‌కులు, ఓ యువ‌తికి మ‌ధ్య జ‌రిగే రొమాంటిక్ ల‌వ్ స్టోరీ. మంచి కామెడితో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. త‌ప్ప‌కుండా సినిమాను పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని న‌మ్ముతున్నాం`` అన్నారు.

నిర్మాత మ‌రిపి విద్యాసాగ‌ర్‌(విన‌య్‌) మాట్లాడుతూ ``సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించాం. మంచి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ప్ర‌ణ‌వ్ మ్యూజిక్‌, ఇత‌ర టెక్నిషియ‌న్స్‌, ఆర్టిస్టులు స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మయంలోనే పూర్తి చేశాం. ఆడియో, సినిమాను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ పూజిత‌, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, ల‌య‌న్ సాయివెంకట్‌, వైజాగ్ ప్ర‌సాద్‌, రాములు, నాగుగ‌వ‌ర‌, సంధ్యాజ‌న‌క్ త‌దిత‌రులు పాల్గొని చిత్ర‌యూనిట్ ను అభినందించారు.

సంధ్యాజ‌న‌క్‌, వైజాగ్ ప్ర‌సాద్‌, స‌రోజ‌, కొండ‌ల‌స ల‌క్ష్మ‌ణ‌రావు, ప్ర‌స‌న్న‌కుమార్‌, పూర్ణిమ ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి సాహిత్యంః కుల‌శేఖ‌ర్‌, పోతుల ర‌వికిర‌ణ్‌, ఆర్ట్ః నాగు, ఎడిట‌ర్ః నంద‌మూరి హ‌రి, సంగీతంః ప్ర‌ణ‌వ్‌, నిర్మాతః మ‌రిపి విద్యాసాగ‌ర్‌(విన‌య్‌), ద‌ర్శ‌క‌త్వంః గ‌ణ‌ముర‌ళి శ‌ర‌గ‌డం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.