close
Choose your channels

అ ఆ కొత్త కథ తో తీసిన సినిమా కాదు..సింపుల్ స్టోరీతో తీసిన జెన్యూన్ ఫిల్మ్ - హీరో నితిన్

Friday, May 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ హీరో నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అ ఆ. ఈ చిత్రానికి అన‌సూయ రామ‌లింగం వెర్షెస్ ఆనంద్ విహారి అనేది క్యాప్ష‌న్. ఈ చిత్రాన్ని హ‌రిక అండ్ హ‌సిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మించారు. జూన్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా యువ హీరో నితిన్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...
టైటిల్ అ ఆ అని పెట్టారు. సినిమా ఎలా ఉంటుంది..?
ఇది ఓ ల‌వ్ స్టోరీ. ఇందులో ల‌వ్, ఎంట‌ర్ టైన్మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే...త్రివిక్ర‌మ్ మార్క్ సినిమా ఇది. అయితే..ఇదేమి కొత్త క‌థ‌తో తీసిన సినిమా కాదు. కానీ సినిమా చాలా అందంగా ఉంటుంది.
మీరు ప్రేమ‌క‌థా చిత్రాలు చాలా చేసారు క‌దా...ఈ సినిమాలో ఉన్న ప్ర‌త్యేక‌త ఏమిటి..?
ల‌వ్ స్టోరీస్ చాలా చేసాను. గ‌తంలో చేసిన ప్రేమ క‌థా చిత్రాల్లో అల్ల‌రి చిల్ల‌రిగా తిరుగుతూ ఉండే క్యారెక్ట‌ర్ చేసాను. అయితే ఇందులో అలా కాదు. కుటుంబం ప‌ట్ల ఒక బాధ్య‌త గ‌ల వ్య‌క్తిగా న‌టించాను. త‌న‌కు ప్రాబ్ల‌మ్ ఉన్నా...బ‌య‌ట‌కు మాత్రం హ్యాపీగా ఉన్నట్టు క‌నిపిస్తాడు.
అస‌లు...అ ఆ ఆఫ‌ర్ ఎలా వ‌చ్చింది..?
గుండెజారి గ‌ల్లంత‌య్యిందే త‌ర్వాత హార్ట్ ఎటాక్ షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లాను. ఆ టైమ్ లో త్రివిక్ర‌మ్ గారు ఫోన్ చేసి ఈ సినిమాలో న‌టించ‌మ‌ని అడిగారు. చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. అయితే...కొన్నికార‌ణాల వ‌ల‌న ప్రాజెక్ట్ ఆగిపోయింది. చాలా బాధ‌ప‌డ్డాను. ఆత‌ర్వాత సంవ‌త్స‌రం క్రితం ఫోన్ చేసి సినిమా చేద్దాం అన్నారు. క‌రెక్ట్ టైమ్ లో క‌రెక్ట్ సినిమా అనిపించింది వెంట‌నే ఓకే చెప్పేసాను.
అ ఆ లో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?
ఈ చిత్రంలో ఓ పెద్దింట్లో వంట‌వాడుగా న‌టించాడు. ఓ మంచి బ్ర‌ద‌ర్ గా, మంచి కొడుకుగా ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు కుటుంబ ప‌ట్ల బాధ్య‌త గ‌ల వ్య‌క్తిగా నా క్యారెక్ట‌ర్ ఉంటుంది.
త్రివిక్రమ్ అని ఈ సినిమాకి ఓకే చెప్పేసారా..? లేక క‌థ న‌చ్చి ఓకే చెప్పారా..?
త్రివిక్ర‌మ్ గారితో ఎప్ప‌టి నుంచో వ‌ర్క్ చేయాల‌నుకుంటున్నాను. ఆయ‌న ఫోన్ చేసి సినిమా చేద్దాం అన‌గానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది ఒక కార‌ణం అయితే...క‌థ న‌చ్చ‌డం మ‌రో కార‌ణం. ఈ చిత్రంలో న‌టించిన రావు రమేష్, న‌రేష్...ఇలా ప్ర‌తి క్యారెక్ట‌ర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమా బాగా వ‌చ్చింది అంటే ఆ క్రెడిట్ అంతా త్రివిక్ర‌మ్ గారికే ద‌క్కుతుంది. 100% డైరెక్ట‌ర్ ఫిల్మ్ ఇది. ఈ మూవీకి రియ‌ల్ హీరో త్రివిక్ర‌మ్ గారే.
త్రివిక్ర‌మ్ తో వ‌ర్క్ చేసారు క‌దా..ఆయ‌న నుంచి ఏమైనా నేర్చుకున్నారా..?
త్రివిక్ర‌మ్ గారు నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. అలాగే ఏక్టింగ్ లో కూడా కొన్నివిష‌యాలు నేర్చుకున్నాను. ఆ డిఫ‌రెన్స్ ఈ సినిమాలో క‌నిపిస్తుంది. త్రివిక్ర‌మ్ గారు రియ‌ల్ లైఫ్ లో జ్ఞాని. ఈ సినిమాలో వ‌ర్క్ చేయ‌డం వ‌ల‌న త్రివిక్ర‌మ్ గారితో మంచి అనుబంధం ఏర్ప‌డింది. కెరీర్ లో మ‌రియు ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో నాకు ఏదైనా ప్రాబ్లమ్ వ‌స్తే...త్రివిక్ర‌మ్ గారికే ఫోన్ చేస్తాను.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెట్స్ కి వ‌చ్చిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యారు..?
క‌ళ్యాణ్ గారు సెట్స్ కి వ‌స్తున్న‌ట్టు నాకు తెలియ‌దు. స‌డ‌న్ గా కళ్యాణ్ గారు సెట్ లో క‌నిపించేస‌రికి ఒక నిమిషం పాటు ఏం జ‌రుగుతుందో అర్ధం కాలేదు. అప్పుడు ఓ సాంగ్ చేస్తున్నాం. ఆయ‌న ముందు డ్యాన్స్ చేయ‌డం అంటే...కాస్త ఇబ్బందిగా, టెన్ష‌న్ గా అనిపించినా హ్యాపీగా ఫీల‌య్యాను.
14 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నారు క‌దా..? ఈ 14 ఏళ్ల‌లో ఏం నేర్చుకున్నారు..?
14 ఏళ్ల‌లో చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా నేను ఎలాంటి సినిమాలు చేయాలో...ఎలాంటి సినిమాలు చేయ‌కూడ‌దో నేర్చుకున్నాను.
త్రివిక్ర‌మ్ గారితో వ‌ర్క్ చేసిన త‌ర్వాత ఏమ‌నిపించింది..?
నేను చాలా మంది డైరెక్ట‌ర్స్ తో వ‌ర్క్ చేసాను. అయితే...ఎవ‌రి స్టైల్ వారిదే. త్రివిక్ర‌మ్ గారు నా బాడీలాంగ్వేజ్, మాట తీరు, హెయిర్ స్ట్టైల్...ఇలా నా గురించి అన్ని విష‌యాల్లో చాలా కేర్ తీసుకున్నారు. తేజ‌, రాజ‌మౌళి గారు త‌ర్వాత నా పై అంత కేర్ తీసుకున్న‌ది త్రివిక్ర‌మ్ గారే.
మీ బెస్ట్ ఫ్రెండ్ స‌మంత ఓ యంగ్ హీరో తో ల‌వ్ లో ఉన్నాను. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పంది..? ఎవ‌రా యంగ్ హీరో..?
నాకు తెలియ‌దు. నాతో ఆ విష‌యాలు గురించి ఏం చెప్ప‌లేదు..
స‌మంత మీకు చెప్ప‌కపోయినా... ఆ హీరో ఎవ‌రో తెలుస్తుంది క‌దా...?
ఆ హీరో ఎవ‌రో మీకు కూడా తెలుసు క‌దా....అంద‌రూ అనుకుంటున్న హీరోనే...(న‌వ్వుతూ...)
ఇంత‌కీ మీ పెళ్లి ఎప్పుడు..?
ఇంట్లో పెళ్లి చేసుకోమ‌ని గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా అడుగుతూనే ఉన్నారు. నేనే నెక్ట్స్ ఇయ‌ర్.. నెక్ట్స్ ఇయ‌ర్ అంటూ... వాయిదా వేస్తున్నాను.
గుండెజారీ గ‌ల్లంత‌య్యిందే సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు క‌దా...ఎప్పుడు ఈ సినిమా ప్రారంభం..?
క‌థ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఫ‌స్టాఫ్ అయ్యింది. సెకండాఫ్ కూడా బాగా వ‌స్తేనే చేయాల‌నుకుంటున్నాను. అంతా అనుకున్న‌ట్టు జ‌రిగితే ఈ చిత్రాన్ని నా సొంత సంస్థ‌లోనే నిర్మిస్తాం.
అ ఆ గురించి ఒక్క మాట‌లో చెప్ప‌మంటే...ఏం చెబుతారు..?
అ ఆ కొత్త క‌థ‌తో తీసిన సినిమా కాదు..సింపుల్ స్టోరీతో తీసిన‌ జెన్యూన్ ఫిల్మ్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.