Omicron BF 7 Variant : భారత్‌లోకి ప్రవేశించిన బీఎఫ్. 7 వేరియంట్ ... అప్పుడే నాలుగు కేసులు, కేంద్రం అలర్ట్

  • IndiaGlitz, [Wednesday,December 21 2022]

ప్రస్తుతం చైనాలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. జీరో కోవిడ్ పాలసీకి సంబంధించిన నిబంధనలు ఎత్తివేసిన తర్వాత కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అక్కడ ఈ స్థాయిలో కేసుల విస్పోటనానికి ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంటే కారణం. ప్రస్తుతం ఈ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్‌కు చెందిన ఓ ఎన్ఆర్ఐ మహిళకు కరోనా టెస్ట్ చేయగా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. అలాగే ఒడిశాకు చెందిన మరో వ్యక్తికి కూడా ఇదే వేరియంట్‌ నిర్థారణ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు అనుమానితులను అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు.

కేంద్రం అప్రమత్తం :

భారత్‌లో ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కలకలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో హై అలర్ట్ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని వెల్లడించింది. అలాగే జీనోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది.

అసలేంటీ బీఎఫ్.7 వేరియంట్ :

ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.5కి చెందిన సబ్ వేరియంటే బీఎఫ్.7. దీనికి బలమైన ఇన్‌ఫెక్షన్ కలిగించే సామర్ధ్యం కూడా వుంది. దీని ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇన్‌ఫెక్షన్ కలిగించే గుణం ఈ వేరియంట్‌కు వుందట. చైనాతో పాటు అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ తదితర దేశాల్లోనూ బీఎఫ్ 7 వేరియంట్ వ్యాప్తి చెందుతోందట. ప్రస్తుతం భారత్‌లోనూ ఈ వేరియంట్ అడుగుపెట్టిన నేపథ్యంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

More News

Rajayogam: అన్ని కమర్షియల్ అంశాలతో 'రాజయోగం' ట్రైలర్ ఆకట్టుకుంది - దర్శకుడు మారుతి

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'రాజయోగం'.

Rangamarthanda: మెగా కంఠంలో 'నేనొక నటుడ్ని' షాయరీ

రంగమార్తాండ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) నేనొక నటుడ్ని విడుదలయ్యింది.

అమెరికా, చైనాలో కోవిడ్ విజృంభణ : భారత్ అప్రమత్తం.. నిర్లక్ష్యం వద్దు , రాష్ట్రాలకు హెచ్చరికలు

చైనాలో కరోనా స్వైర విహారం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది.

TTD EO Dharmareddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి.. వచ్చే నెలలో పెళ్లి, అంతలోనే

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి (28) కన్నుమూశారు.

KTR: డ్రగ్స్ టెస్ట్ కోసం కిడ్నీ, బ్లడ్ కూడా ఇస్తా.. నువ్వు చెప్పు దెబ్బలకు సిద్ధమా: బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్

తాను డ్రగ్స్‌కు బానిసనంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. తాను డ్రగ్స్ టెస్ట్‌కు రెడీ అని ప్రకటించారు.