‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి ప్రధాని మోడీ అభినందనలు

మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, అనుప‌మ్ ఖేర్, ద‌ర్శ‌న్ కుమార్, ప‌ల్ల‌వి జోషి ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా మార్చి 11కు వాయిదా పడింది. చిత్రం విడుద‌లైన మొద‌టి షో నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

1990వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోత సహా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 1990లలో హిందూ పండిట్స్‌పై అప్పటి వరకు వారితో కలిసి మెలిసి తిరిగిన వేరే మతానికి చెందిన ఈ మారణకాండకు తెగబడ్డారు. హత్యలతో పాటు వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్వదేశంలోనే శరణార్ధులుగా మారారు. ఈ సంఘటనల ఆధారంగానే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ను తెరకెక్కించారు వివేక్. అయితే ఈ సినిమాను నిలిపివేయాలని కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.

ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న నేపథ్యంలో నిర్మాత అగ‌ర్వాల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రీ, త‌న భార్య ప‌ల్ల‌వి జోషిలు ప్ర‌ధాని మోడీని క‌లిసారు. ఆ సందర్భంగా ఆయన సినిమాను, చిత్ర బృందాన్ని ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా మోడీని నిర్మాత అభిషేక్ అగర్వాల్ శాలువాతో సత్కరించారు.

More News

మంగళగిరిలో రేపు జనసేన ఆవిర్భావ సభ .. అన్నింటికీ రేపు సమాధానం చెబుతా : పవన్ కల్యాణ్

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో జరగనున్నాయి.

డ్రెస్‌ని బట్టి క్యారెక్టర్ జడ్జ్ చేసేస్తారా.. నెటిజన్లకు సమంత ఘాటు వార్నింగ్

టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత.. ముక్కుసూటిగా వుంటారన్న సంగతి తెలిసిందే. ఎవరేమి అనుకున్నాసరే.. తనకు నచ్చినట్లుగా వుంటుంది.

పర్స్‌లు కొట్టేస్తూ .. పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన నటి, వెలుగులోకి సంచలన విషయాలు

సాధారణంగా హీరోయిన్లు పబ్లిక్ ప్లేసుల్లోకి వస్తే.. తమ అందాన్ని, వస్త్రధారణను చూపించేందుకు ప్రయత్నిస్తారు. ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం,

కమల్ హాసన్ ‘‘విక్రమ్’’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. సరికొత్త లుక్‌లో విలక్షణ నటుడు

విలక్షణ నటుడు కమల్ హాసన్ మరోసారి దూకుడు పెంచారు. యువ హీరోలకు పోటీగా ఆయన సినిమాలు తీస్తున్నారు. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో

విషాదం: ‘రాధే శ్యామ్’‌కు మిక్స్‌డ్ టాక్ .. తట్టుకోలేక ప్రభాస్ అభిమాని ఆత్మహత్య

భారత్‌లో సినీతారలకు వున్న క్రేజ్ సాధారణమైంది కాదు. వారిని దైవంలా ఆరాధిస్తారు అభిమానులు. వాళ్ల ఒంటిపై ఈగ వాలనివ్వరు.