close
Choose your channels

డ్రెస్‌ని బట్టి క్యారెక్టర్ జడ్జ్ చేసేస్తారా.. నెటిజన్లకు సమంత ఘాటు వార్నింగ్

Sunday, March 13, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత.. ముక్కుసూటిగా వుంటారన్న సంగతి తెలిసిందే. ఎవరేమి అనుకున్నాసరే.. తనకు నచ్చినట్లుగా వుంటుంది. చెప్పాల్సిన విషయాన్ని కుండబద్ధలు కొట్టి చెప్పడం ఆమె స్టైల్. ఈ క్రమంలో ఆమెకు పొగరని, దురుసు స్వభావమని పలు రకాలుగా కామెంట్లు వచ్చేవి. కానీ వీటిని పట్టించుకోని మనస్తత్వం సమంతది. నాగచైతన్యతో విడాకుల విషయంగానూ ఇష్టమొచ్చినట్లు ట్రోల్ చేస్తున్న వారికి తొలుత సున్నితంగా చెప్పి చూసింది. అయినప్పటికీ వినకపోవడంతో కోర్టు ద్వారానే సమాధానం చెప్పింది. తాజాగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై కామెంట్స్ చేసిన నెటిజన్‌కు తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చింది.

అసలేం జరిగిందంటే.. క్రిటిక్స్‌ ఛాయిస్‌’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కోసం సమంత ఇటీవల ముంబయికు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఫ్రాక్ వార్తల్లో నిలిచింది. దాదాపు రూ.2 లక్షల ఖరీదు చేసే గ్రీన్‌ కలర్‌ లాంగ్‌ వెస్ట్రన్‌ ఫ్రాక్‌తో సమంత సందడి చేశారు. ఆ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే దీనికి కాంప్లిమెంట్స్ రాకపోగా వాటిని చూసిన నెటిజన్లు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. విడాకుల అనంతరం సామ్‌ కొత్తగా ప్రవర్తిస్తున్నారని.. ఆమె వస్త్రాధారణలోనూ మార్పులు వచ్చాయంటూ సమంతను ట్రోల్ చేశారు. ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో ఘాటుగా కౌంటరిచ్చారు.

ఎదుటివారిపై ఓ అభిప్రాయానికి రావాలంటే.. ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలో ఒక స్త్రీగా తనకు అవగాహన ఉందన్నారు. కానీ, ఇప్పుడు మనం.. దుస్తులు, శరీర రంగు, చదువు.. ఇలా ఎన్నో అంశాలను ఆధారంగా చేసుకుని మహిళలపై ఓ నిర్ణయానికి వస్తున్నామంటూ సమంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మనిషి ధరించిన దుస్తుల్ని బట్టి వారిని జడ్జ్‌ చేయడం ఎంతో తేలికని... ప్రస్తుతం మనం 2022లో ఉన్నామని సామ్ చురకలు వేశారు. మహిళలు ధరించిన దుస్తుల్ని బట్టి వాళ్ల క్యారెక్టర్‌ని నిర్ణయించడం ఇకనైనా మానుకోవాలని సమంత హితవు పలికారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.