close
Choose your channels

వనమా రాఘవ అరెస్ట్ అయ్యాడా.. లేదా... కొనసాగుతున్న సస్పెన్స్

Friday, January 7, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వనమా రాఘవ అరెస్ట్ అయ్యాడా.. లేదా... కొనసాగుతున్న సస్పెన్స్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు వనమా రాఘవేంద్ర రావు అరెస్ట్ అయ్యాడా లేదా అన్నది తెలియరావడం లేదు. నిన్న హైదరాబాద్‌లో స్వయంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు , మరికొందరు టీఆర్ఎస్ నేతలు కలిసి రాఘవను పోలీసులకు అప్పగించినట్లుగా కథనాలు వచ్చాయి. అయితే అతడిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్‌ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు కావడంతోనే పోలీసులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. రాఘవపై చర్యలు తీసుకోవాలంటూ కొత్తగూడెం బంద్‌కు పిలుపునిచ్చారు.

మరోవైపు తాజాగా పోలీసులు రాఘవ ఇంటికి నోటీసులు అతికించారు. 2001లో నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల్లోపు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. పోలీసులు రాఘవకు సంబంధించి పాత కేసులను తిరగదోడుతున్నట్లుగా తెలుస్తోంది. అతనిని పట్టుకోవడానికి 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అయితే, వనమా రాఘవ రాజమండ్రిలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులకు అక్కడికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

కాగా.. నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలు సాహితి, సాహిత్యపై సోమవారం తెల్లవారుజామున పెట్రోల్‌ పోసి తానూ నిప్పటించుకున్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా.. 80శాతం గాయాలతో తీవ్రంగా గాయపడిన సాహితి ఆస్పత్రిలో మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి బుధవారం కన్నుమూసింది. తొలుత ఈ కేసును ప్రమాదంగా, ఆత్మహత్యగా భావించారు. కానీ రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్‌లో వనమా రాఘవేంద్రే అన్నింటికి కారణమని తేలడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాఘవ అజ్ఞాతంలోనే వున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.