YS Jagan:పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే అడ్డుపడుతున్నారు: జగన్

  • IndiaGlitz, [Friday,March 01 2024]

ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని సీఎం జగన్ మండిపడ్డారు. విద్యార్థులకు మంచి చేయడం కోసం వారితో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. కృష్ణా జిల్లా పామర్రులో జగనన్న విద్యాదీవెన పథకం కింద అక్టోబర్-డిసెంబర్-2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు.

'వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి. మన పిల్లలు చదవొద్దా.?. తెలుగు భాష అంతరించిపోతుందంటూ నానా యాగీ చేస్తున్నారు. పిల్లలకు ట్యాబులు ఇస్తే చెడిపోతారంటూ ప్రచారం చేస్తున్నారు. పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారుల మనస్తత్వం గమనించండి. చంద్రబాబు, ఆయన మనుషుల పెత్తందారీ భావజాలాన్ని గమనించండి. పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు చంద్రబాబు ఎప్పుడైనా ప్రయత్నించారా.? పేద విద్యార్థుల కోసం ఆయన చేసిన మంచి ఏంటి.?. ఆయన ఏ రోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా.?. చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రైవేట్ విద్యా సంస్థల కోసమే' అంటూ మండిపడ్డారు.

పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువే అని.. అందుకే విద్యారంగం అభివృద్ధికి ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. నాడు - నేడుతో స్కూళ్ల రూపురేఖలే మార్చేశామన్నారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఎదగాలని.. ప్రపంచంతో పోటీ పడేలా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని.. విద్యార్థులకు ట్యాబ్స్ అందుబాటులోకి తెచ్చి డిజిటల్ పద్ధతిలో బోధనకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించారు. 93శాతం మందికి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన ఇస్తున్నామని చెప్పారు. 57నెలల్లో విద్యారంగంలో ఎలాంటి మార్పులు తెచ్చామో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. పెత్తందారులకు, పేదలకు మధ్య జరుగుతుందని.. ఈ యుద్ధంలో పేదలు గెలవకపోతే కూలీల పిల్లలు కూలీలుగా మిగిలిపోతారని జగన్ వెల్లడించారు.

More News

YS Sunitha Reddy:మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వేయొద్దు.. ప్రజలకు వైయస్ సునీతారెడ్డి పిలుపు..

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాకూడదంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి(YS Sunitha)

TDP:ఎన్డీఏలో టీడీపీ చేరడం ఖాయం.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే..?

ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఊహించినట్లుగానే 2014 ఎన్నికల సీన్ రిపీట్ కానుంది.

Niharika:‘సాగు’వంటి మంచి కాన్సెప్ట్ సినిమాలను అందరూ ప్రోత్సహించాలి: నిహారిక కొణిదెల

వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలుగా సాగు అనే ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

PM Surya Ghar Yojana: కోటి ఇళ్లకు కరెంట్ ఫ్రీ.. సూర్యఘర్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం..

దేశ ప్రజలకు లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశంలో సౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత పెంచి సామాన్య ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా తీసుకొచ్చిన ప్రధాని

Pawan Kalyan: ఫ్రస్ట్రేషన్‌లో పవన్ కల్యాణ్‌.. బాబు మెప్పు కోసం పూనకాలతో ఊగిపోతూ..

తాడేపల్లిగూడెం జెండా సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆవేశంగా ఊగిపోతూ సీఎం జగన్‌పై విరుచుకుపడుతూ రెచ్చిపోయారు. ఇది చూసిన కొంతమంది జనసైనికులు ఆహో ఓహో అంటూ ఎగిరి గంతెలేస్తున్నారు