close
Choose your channels

Pawan Kalyan: ఫ్రస్ట్రేషన్‌లో పవన్ కల్యాణ్‌.. బాబు మెప్పు కోసం పూనకాలతో ఊగిపోతూ..

Thursday, February 29, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Pawan Kalyan: ఫ్రస్ట్రేషన్‌లో పవన్ కల్యాణ్‌.. బాబు మెప్పు కోసం పూనకాలతో ఊగిపోతూ..

తాడేపల్లిగూడెం జెండా సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆవేశంగా ఊగిపోతూ సీఎం జగన్‌పై విరుచుకుపడుతూ రెచ్చిపోయారు. ఇది చూసిన కొంతమంది జనసైనికులు ఆహో ఓహో అంటూ ఎగిరి గంతెలేస్తున్నారు. కానీ అసలు విషయం అది కాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు చంద్రబాబు కేవలం 24 సీట్లు మాత్రమే ఇచ్చారు. అందులోనూ 5 సీట్లలో మాత్రమే అభ్యర్థులను పవన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పవన్‌కళ్యాణ్‌పైన తీవ్ర స్థాయిలో జనసేన కార్యకర్తలు, నాయకులు రగిలిపోయారు.

పవన్ తీరుపై జనసైనికుల్లో ఆగ్రహావేశాలు..

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టుగా ప్యాకేజీకి అమ్ముడుపోయారన్న భావన జనసేన పార్టీ కార్యకర్తల్లో బాగా బలపడింది. పవన్‌ అంటే కార్యకర్తల్లో ఒకరకమైన ఏహ్యభావం ఏర్పడింది. ఆయన పేరు వింటే ఈసడించుకునే పరిస్థితి మొదలైంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును పవన్ భుజాన వేసుకుంటున్న తీరు జనసైనికులతో పాటు అనుకూల వర్గాల్లో తీవ్ర ఆశ్చర్యానికి దారితీస్తోంది. మునుపెన్నడూలేని రీతిలో కాపు సామాజిక వర్గాలకు రాజకీయంగా తీరని అన్యాయం చేశారని ఆగ్రహంతో ఉన్నారు. పవన్‌ను అభిమానించే అందరూ ఆయన తీరుపై భగ్గుమంటున్నారు.

Pawan Kalyan: ఫ్రస్ట్రేషన్‌లో పవన్ కల్యాణ్‌.. బాబు మెప్పు కోసం పూనకాలతో ఊగిపోతూ..

బుజ్జగించేందుకు కొత్త నాటకానికి తెర..

ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించడానికి కొత్త నాటకానికి తెరతీశారు. ఇందుకు తాడేపల్లిగూడెం సభను వేదికగా ఎంచుకున్నారు. జనసేన పార్టీకి పూర్తి విరోధి సీఎం జగన్ మాత్రమే అని చెప్పడానికి నానా తంటాలు పడ్డారు. జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ దూషించడం ద్వారా జనసేన కార్యర్తల్లో మళ్లీ వేడి పుట్టించే ప్రయత్నం చేశారు. జగన్‌ను ఒక విలన్‌ఆ మార్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ సభలో ఉన్న వారి నుంచి పెద్దగా స్పందన రాలేదని అర్థమవుతోంది. దీంతో మరింత ఊగిపోయిన జనసేనాని రచయితలు రాసిచ్చి డైలాగులతో మరింత రెచ్చిపోయారు.

Pawan Kalyan: ఫ్రస్ట్రేషన్‌లో పవన్ కల్యాణ్‌.. బాబు మెప్పు కోసం పూనకాలతో ఊగిపోతూ..

గతంలో పవన్ మట్లాడిన వ్యాఖ్యలు వైరల్..

అంతేకాకుండా టీడీపీ జెండాను పవన్‌ కళ్యాణ్‌ ఊపడం, జనసేన జెండాను చంద్రబాబు ఊపడం జనసేన కార్యకర్తల్లో మరింత ఆగ్రహాన్ని నింపింది. చూసేవారికి కూడా ఎబ్బెట్టుగా అనిపించింది. ఇక సలహాలు ఇచ్చేవారు తనకు వద్దంటూ జనసేన మేధావి వర్గాలను సైతం కించపరిచేలా పవన్ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇలా ఊగటాలు, శాసనార్ధారాలు, తిట్లు, ద్వేషించే మాటలు, పరిధికి మంచి ఆవేశం ప్రదర్శించడం గతంలోనే చేసేవారు. 2019 ఎన్నికలకు ముందు పవన్ ఆవేశంతో మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. జగన్‌ ముఖ్యమంత్రి కాలేరని ఇది శాసనమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. కానీ చివరకు జగన్ భారీ మెజార్టీతో గెలిచి సీఎం అయ్యారనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

Pawan Kalyan: ఫ్రస్ట్రేషన్‌లో పవన్ కల్యాణ్‌.. బాబు మెప్పు కోసం పూనకాలతో ఊగిపోతూ..

వ్యూహాత్మకంగా వ్యవహరించిన చంద్రబాబు..

పవన్ మాటలను పట్టించుకునే స్థితిలో ఎవరూ లేరనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా ఈ సభలో వ్యవహరించారు. జనసేనను రాజకీయంగా పూర్తిగా లొంగదీసుకున్న విషయాన్ని ఎక్కడా కనిపించనీయకుండా జాగ్రత్తపడ్డారు. సభా నాయకుడిగా పవన్‌కళ్యాణ్‌ను చివర్లో మాట్లాడించడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పొత్తు రాజకీయ సభ కాకుండా పవన్‌కళ్యాణ్‌కు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత సభలా చూపించే ప్రయత్నాలు చేశారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos