close
Choose your channels

మ‌హేశ్‌పై పూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Friday, July 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హేశ్‌పై పూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌.. ఈ టైటిల్‌లో సూప‌ర్‌స్టార్ అనే ఇమేజ్ మ‌హేశ్‌కు రావ‌డానికి కార‌ణ‌మైన ద‌ర్శ‌కుడెవ‌రైనా ఉన్నారా? అంటే ట‌క్కున వ‌చ్చే స‌మాధానం పూరి జ‌గ‌న్నాథ్‌. మ‌హేశ్‌, పూరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి చిత్రం `పోకిరి`. బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. రెండో చిత్రం బిజినెస్‌మేన్ కూడా సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. అయితే అప్ప‌టి నుండి పూరి, మ‌హేశ్‌తో `జ‌న‌గ‌ణ‌మ‌న‌` సినిమా చేయాల‌ని చాలా ప్ర‌య‌త్నాలే చేస్తూ వ‌స్తున్నాడు. కానీ ఏవీ వ‌ర్క‌వుట్ కాలేదు. పూరికి కూడా ఈ మ‌ధ్య స‌క్సెస్ లేదు. అయితే రీసెంట్‌గా విడుద‌లైన `ఇస్మార్ట్ శంక‌ర్‌` పూరి హిట్ కొట్టాడు.

ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత పూరి ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతున్నారు. ఆ సంద‌ర్భంలో మ‌హేశ్ గురించిన ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. అప్పుడు పూరి గ‌ట్టిగానే మ‌హేశ్‌కు పంచ్ ఇచ్చారు. ``మ‌హేశ్ అభిమానులు చాలా మంది `జ‌న‌గ‌ణ‌మ‌న‌` ఆయ‌న‌తో చేయ‌మ‌ని అన్నారు. కానీ నేను హిట్స్‌లో ఉంటేనే మ‌హేశ్ నాతో సినిమా చేస్తాడు. కాబ‌ట్టి నాకు ఆయ‌న‌కంటే ఆయ‌న అభిమానులంట‌నే ఇష్టం. ఎందుకంటే మ‌హేశ్‌కు రెండు మంచి సినిమాలు ఇచ్చాన‌ని వారి న‌మ్మ‌కం` అన్నారు. `మ‌రిప్పుడు `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హిట్ కొట్టారుగా మ‌హేశ్, ఇప్పుడు మీతో సినిమా చేస్తారేమో` అని యాంకర్ అంటే `నేను ఎస్ చెప్ప‌డానికి నాకంటూ ఓక్యారెక్ట‌ర్ ఉంటుందిగా` అని పూరి ఇన్‌డైరెక్ట్‌గా మ‌హేశ్‌తో సినిమాలు చేయ‌న‌ని చెప్పేలా స‌మాధానం ఇచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.