రజినీ అభిమానుల్లో ఉన్న ఆనందం.. సాయంత్రానికి ఆవిరి..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడుతున్న విషయం కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఊహాగానాలకు కొదువ లేకుండా పోతోంది. మంగళవారమైతే ఏకంగా పార్టీ పేరు, గుర్తు గురించి భారీగా ప్రచారం జరిగింది. పార్టీ పేరు.. ‘మక్కల్‌ సేవై కట్చి’ అని.. ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించిందని కూడా ప్రచారం సాగింది. అయితే ఉదయం ఉన్న అభిమానుల ఉత్సాహం సాయంత్రం అయ్యే వరకూ ఆవిరై పోయింది.

కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటనలో కొత్త పార్టీలను రిజిస్టర్‌ చేసుకున్నవారికి చిహ్నాలను సైతం కేటాయించింది. ఆ జాబితా చివరన మక్కల్‌ సేవై కట్చి అనే పార్టీకి ఆటో గుర్తును కేటాయించినట్టు ఉంది. అది చూసిన రజినీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ అభిమాన నాయకుడి పార్టీ పేరును ‘మక్కల్‌ సేవై కట్చి’గా కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్‌ చేయించారని సంతోషపడ్డారు. అంతేకాకుండా ఆటో గుర్తును కేటాయించడం పార్టీకి కలిసొచ్చే అంశంగా భావించారు.

అయితే మంగళవారం సాయంత్రం అయ్యే వరకూ అభిమానుల ఆనందం ఆవిరై పోయింది. రజనీ అభిమానులను నిరుత్సాహపరిచేలా రజనీ మక్కల్‌ మండ్రం నేత వీఎన్‌ సుధాకర్‌ ఓ ప్రకటన జారీ చేశారు. పార్టీ పేరు, పార్టీ గుర్తుపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆ సమాచారం వాస్తవం కాదని, రజనీ మక్కల్‌ మండ్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ అభిమానులు, మక్కల్‌ మండ్రం నేతలు ఓర్పు వహించాలని ఆ ప్రకటనలో సుధాకర్‌ విజ్ఞప్తి చేశారు.

More News

అమెజాన్ అనో.. ఫ్లిప్‌కార్ట్ అనో క్లిక్ చేశారో.. అంతే సంగతులు..

మీ మొబైల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. పండుగ సందర్భంగా బ్రాండెడ్ వస్తులపై ఫ్లాట్ 45-60 పర్సెంట్ డిస్కౌంట్ అని..

క్రెడిట్ అంతా వరుణ్‌కే.. నిహారికను అమ్మలాగే చూస్తా: సాయితేజ్

మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయమై ఓ ఇంటర్వ్యూలో సాయితేజ్ స్పందించాడు. ముందుగా ఆమె పెళ్లి పనుల గురించి మాట్లాడుతూ..

హగ్ చేసుకున్న అఖిల్, అభి.. సందడిగా సాగిన షో..

‘ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడే..’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఆ వెంటనే గీతా మాధురి, హరి తేజ, శ్రీముఖి, అలీ రెజాను చూపించారు.

కరోనాతో పోరాడి ఇంటికి చేరిన అనంతరం పక్షవాతానికి గురైన నటి..

కరోనా కారణంగా ఎవరేంటనే విషయం తెలిసొచ్చింది. అసలైన హీరో, హీరోయిన్లు ఎవరనే విషయం తెలిసింది.

ఇకపై దుర్గమ్మను దర్శించుకోవాలంటే డబుల్ చెల్లించుకోవాల్సిందే..

బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి రేట్లు భారీగా పెంచేశారు. ఈ నిర్ణయాన్ని దుర్గగుడి అధికారులు తీసుకోగా..