close
Choose your channels

క్రెడిట్ అంతా వరుణ్‌కే.. నిహారికను అమ్మలాగే చూస్తా: సాయితేజ్

Wednesday, December 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్రెడిట్ అంతా వరుణ్‌కే.. నిహారికను అమ్మలాగే చూస్తా: సాయితేజ్

మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయమై ఓ ఇంటర్వ్యూలో సాయితేజ్ స్పందించాడు. ముందుగా ఆమె పెళ్లి పనుల గురించి మాట్లాడుతూ.. క్రెడిట్ మొత్తాన్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి ఇచ్చేశాడు. చాలా బాగా చేశాడని కొనియాడాడు. ఏవో అతిథుల్ని ఆహ్వానించడం.. వాళ్లకి ఏర్పాట్లు చూడటం వంటి కొన్ని పనులు మాత్రమే తాను చూసుకున్నానని వెల్లడించాడు. వరుణ్ అంతా తానై పెళ్లి వేడుకను జరిపించాడన్నాడు. పండుగలు, వేడుకలు ఏమైనా జరిగితే కుంటుంబ సభ్యులమంతా కలుస్తుంటామని కానీ వంద శాతం కలిసేది మాత్రం ఇలాంటి సందర్భాల్లోనేనని నిహారిక వివాహం తమకు ఎంతగానో ఆనందాన్నించిందని తెలిపాడు.

పెళ్లి తర్వాత ఇన్‌స్టాలో ‘మా ఇంటి సూర్యకాంతం.. ఇక మీ ఇంటి సూర్యకాంతం’ అంటూ పెట్టిన పోస్టుపై సాయి తేజ్ స్పందిస్తూ నిహారిక ఇంట్లో చాలా హుషారుగా.. అల్లరి చేస్తూ.. అందరినీ సంతోషపెడుతుందని చెప్పాడు. తను ‘సూర్యకాంతం’ పేరుతో సినిమా చేసిందని.. అందుకే సూర్యకాంతం అంటూ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రాశానని తెలిపాడు. చైతన్య, నిహారికలది మంచి జోడీ అని సాయితేజ్ వెల్లడించాడు.

కాగా.. నిహారికతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. తమ ఇంట్లోని కజిన్స్ అంతా అన్నాచెల్లెళ్లు గానే పెరిగామని.. చిన్నప్పటి నుంచి నిహారికను చెల్లిగానే ఫీలవుతున్నానని చెప్పాడు. శ్రీజ, సుస్మిత అందరితోనూ అక్కాతమ్ముళ్ల బంధమే ఉందని సాయితేజ్ తెలిపాడు. అయితే నిహారికకు చాలా వరకూ తన తల్లి పోలికలుంటాయని.. అంతా ఆమెను మేనత్త పోలికే అంటుంటారని చెప్పాడు. అలా నిహారిక తన తల్లి అన్నాడు. తనను అమ్మలాగే చూసుకుంటామని వెల్లడించాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.