close
Choose your channels

తమిళ చిత్రంపై మనసుపడ్డ రామ్ చరణ్

Tuesday, October 22, 2019 • తెలుగు Comments

తమిళ చిత్రంపై మనసుపడ్డ రామ్ చరణ్

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ తమిళ చిత్రంపై మనసు పడ్డాడట. ఆ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడని సినీ వర్గాల సమాచారం. ఇంతకు రామ్‌చరణ్‌ రీమేక్‌ చేయాలనుకుంటున్న సినిమా ఏదో తెలుసా? తమిళ చిత్రం ‘అసురన్‌'. ఇటీవల తమిళనాట విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. రా కాన్సెప్ట్‌తో సాగే ఈ సినిమా తన బాడీ లాంగ్వేజ్‌కి అయితే సూట్‌ అవుతుందని చరణ్‌ భావిస్తున్నాడట. అందుకని తెలుగులో రీమేక్‌ చేయాలనుకుంటున్నాడని టాక్‌.

రంగస్థలంలో పక్కా మాస్‌ లుక్‌లో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చిట్టిబాబుగా నటించిన రామ్‌చరణ్‌  అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అసురన్‌తో మరోసారి ఆకట్టుకోవాలనుకుంటున్నాడని సమాచారం. ధనుష్‌, మంజు వారియర్‌ నటించిన ఈ చిత్రాన్ని వెట్రిమారన్‌ తెరకెక్కించాడు. కలైపులి థాను ఈ సినిమాను నిర్మించాడు. మరి రామ్‌చరణ్‌ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz