మెగా కోడలు ఉపాసనకు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ, ఏంటీ దాని ప్రత్యేకత ..!!

మెగా కోడలు, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన కామినేని.. భర్త రామ్‌చరణ్‌కు చేదోడువాదోడుగా వుంటారు. సినిమాలు, షూటింగ్‌లతో చెర్రీ బిజీగా వున్నప్పటికీ.. వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలను ఉపాసన చక్కదిద్దుతూ భర్తకు అండగా వుంటున్నారు. అంతేకాదు.. పలు సేవా కార్యక్రమాలను చేపడుతూ.. ఛారిటీలను నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఉపాసనకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకమైన దుబాయ్ గోల్డెన్ వీసాను పొందారామె. యూఏఈ గోల్డెన్‌ వీసా పొందడం సంతోషంగా ఉందన్నారు ఉపాసన. తాను అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని అంటూ తన ఆనందాన్ని ట్విట్టర్‌లో తెలిపారు ఉపాసన.

ఇటీవల దుబాయ్‌లో 2020 ఎక్స్‌పోను ఉపాసన సందర్శించారు. అంతేకాకుండా అగ్‌మెంటెడ్‌ రియాలిటీ ద్వారా ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఉపాసన గోల్డెన్ వీసాను పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు భారతీయ ప్రముఖులు యూఏఈ గోల్డెన్ వీసాలు అందుకున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మలయాళ నటుడు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, నటి త్రిష, గాయని చిత్ర ఇలా చాలా మంది గోల్డెన్ వీసా అందుకున్నారు.

ఈ గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం 2019 నుంచి జారీ చేస్తోంది. అయితే ఈ వీసాను అందరికీ ఇవ్వరు. సాహిత్యం, విద్య, కళలు, పరిశ్రమలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ వీసా అందజేస్తారు. దీని సాయంతో దుబాయ్లో ఎటువంటి ఆంక్షలు లేకుండా నివసించవచ్చు. స్థానికులకు ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి హక్కులు ఈ గోల్డెన్ వీసా పొందిన వారికి కూడా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ వ్యాపారం చేసుకొవడానికి కూడా వారికి అనుమతి ఉంటుంది. 5 నుంచి 10 ఏళ్ల వరకు దీని కాలపరిమితి ఉంటుంది. అనంతరం ఆటోమోటిక్గా రెన్యూవల్ అవుతుంది.

More News

బికినీలో సమంత... మళ్లీ ఫోటోలు వైరల్, గ్యాంగ్‌తో కలిసి గోవాలో చక్కర్లు

జీవితాన్ని నచ్చినట్లుగా కొనుగోలు చేసేవారు కొందరే వుంటారు. అలాంటి వారిలో సమంత కూడా ఖచ్చితంగా వుంటారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బాలయ్య ప్రశంసల వర్షం.. కానీ..!!!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటించిన ‘‘అఖండ’’ సూపర్‌హిట్ కావడంతో చిత్ర యూనిట్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను చుట్టేస్తున్నారు బాలయ్య.

అఖిల్ కంప్లీట్ మేకోవర్.. అచ్చం హాలీవుడ్ హీరోలాగా, ఆ కండలేంటీ బాబోయ్

తెలుగు చిత్ర సీమలోని పెద్ద కుటుంబాల్లోని ఒకటైన అక్కినేని ఫ్యామిలి వారసుడు ‘‘అఖిల్’’ హిట్టు అందుకోవడానికి ఏళ్ల  పాటు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాడు.

కిందపడేసేలోపు మూడుసార్లు కరిచింది.. పాముకాటుపై స్పందించిన సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను పాము కరిచిన వార్తతో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.

చిత్ర పరిశ్రమలో మరో విషాదం... ప్రముఖ సింగర్ కన్నుమూత

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పలువురు ప్రముఖులు కన్నుమూశారు.