close
Choose your channels

అఖిల్ కంప్లీట్ మేకోవర్.. అచ్చం హాలీవుడ్ హీరోలాగా, ఆ కండలేంటీ బాబోయ్

Monday, December 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అఖిల్ కంప్లీట్ మేకోవర్.. అచ్చం హాలీవుడ్ హీరోలాగా, ఆ కండలేంటీ బాబోయ్

తెలుగు చిత్ర సీమలోని పెద్ద కుటుంబాల్లోని ఒకటైన అక్కినేని ఫ్యామిలి వారసుడు ‘‘అఖిల్’’ హిట్టు అందుకోవడానికి ఏళ్ల పాటు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాడు. తన బ్యాక్‌గ్రౌండ్, అక్కినేని అనుచరగణం లాంచింగ్ వరకే ఉపయోగపడ్డారు. తర్వాత తనను తాను నిరూపించుకోవడంలో ఈ కుర్రాడు కాస్త తడబడ్డాడు. స్టోరీ సెలక్షన్‌లో రాంగ్ స్టెప్, ఇతరత్రా కారణాలతో అఖిల్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఒక్క హిట్టు తనకు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూశాడు. ఈ క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’’ అఖిల్ కరువు తీర్చేసింది.

కరోనా లాక్‌డౌన్ ముగిసిన తర్వాత .. అప్పుడప్పుడే థియేటర్లు తెరుస్తున్న సమయంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. మౌత్ పబ్లిసిటీతో యువత, ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్‌కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇంతకాలానికి హిట్ దక్కడంతో దానిని అలాగే కొనసాగించే ప్రయత్నంలో పడ్డాడు అక్కినేని వారబ్బాయి.

ఈ కోవలోనే తన కొత్త సినిమా 'ఏజెంట్'తో మాస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. వక్కంతం వంశీ అందించిన కథతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం అఖిల్ చాలానే కష్టపడుతున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అలాగే బాడీ మేకోవర్ కోసం జిమ్‌లో గంటలు తరబడి వర్కవుట్లు చేస్తున్నాడు. కండలు తిరిగిన దేహంతో ఉన్న అఖిల్ తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది. చాక్లెట్ బాయ్‌లా క్యూట్‌గా కనిపించే అఖిల్‌ను అలా ఎప్పుడూ చూడని ఫ్యాన్స్.. కుర్రాడు ఈ లుక్‌లోనూ బాగానే వున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.