చరణ్, యష్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

  • IndiaGlitz, [Thursday,February 11 2021]

సౌత్ ఇండియాలో స్టార్ హీరోల కాంబినేష‌న్‌లో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మ‌ల్టీస్టార‌ర్‌కు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. మ‌రి ఈ సినిమాను ఎవ‌రు నిర్మిస్తారో తెలియ‌డం లేదు కానీ.. సినిమా మాత్రం ట్రాక్ ఎక్క‌డం ప‌క్కాగా అని అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించ‌బోయే స్టార్ హీరోలు ఎవ‌రో కాదు.. టాలీవుడ్ మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్‌, మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి. ఈ ముగ్గురితో క‌లిసి భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను తెర‌కెక్కిచ‌నున్న డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌.

ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మ‌ల్టీస్టార‌ర్ రూపొందుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున నేప‌థ్యంలో ఇండియ‌న్ 2 గురించి అంద‌రిలో మ‌రోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇండియ‌న్ 2 సినిమా రీస్టార్ట్ అవుతుందో లేదో అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఇండియ‌న్ 2 తిరిగి సెట్స్‌పైకి వెళుతుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో శంక‌ర్ మ‌రో భారీ సినిమాను తెర‌కెక్కిస్తాడ‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై అటు శంక‌ర్ కానీ.. ఇండియ‌న్ 2ను నిర్మిస్తోన్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌తినిధులు కానీ స్పందిస్తారేమో చూడాలి.

More News

జీహెచ్ఎంసీ మేయర్‌గా విజయలక్ష్మి.. డిప్యూటీ మేయర్‌గా శ్రీలత

కొన్ని నెలల పాటు మహా నగర ప్రథమ పౌరురాలి ఎన్నికను వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు నేడు ముహూర్తం ఖరారు చేసింది.

ఎన్టీఆర్ 31 ఫిక్స్‌.. క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన నిర్మాత‌లు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తున్నాడు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో

‘ఉప్పెన’ టీంకు పవన్ అభినందనలు..

‘ఉప్పెన’... మన చుట్టూ ఉన్న జీవితాల్ని చూపించే చిత్రమని.. తొలి చిత్రంతోనే మంచి పాత్రలో నటించిన వైష్ణవ్ తేజ్ ప్రేక్షకుల మెప్పు పొందుతాడని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు.

‘లైగ‌ర్’ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. షూటింగ్ రీస్టార్ట్

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’.

‘రాములో రాముల’ రికార్డ్ కొట్టిందిరో...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రూపొందించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో..’.