close
Choose your channels

సంక్రాంతి బరిలోకి రానా 'అరణ్య'

Wednesday, October 21, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సంక్రాంతి బరిలోకి రానా అరణ్య

రానా ద‌గ్గుబాటి టైటిల్ పాత్ర పోషించిన అర‌ణ్య చిత్రం వచ్చే ఏడాది అంటే 2021 సంక్రాంతికి థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు‌. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోజ్‌ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్ర‌భుసాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్నో కష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆగింది. దాదాపు ఆరేడు నెలలు థియేటర్స్‌ ఓపెన్‌ కాలేదు.

ఈ నేపథ్యంలో అరణ్య చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తారని కూడా వార్తలు వినిపించాయి. కానీ నిర్మాణ సంస్థ థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యే వరకు వెయిట్‌ చేసింది. ఎట్టకేలకు సినిమాను థియేటర్స్‌ ఓపెన్‌ అయిన నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అడవిలో ఉండే మనిషి అరణ్యగా రానా ఇందులో నటించారు. విష్ణు విశాల్‌ కీలక పాత్రలో నటించారు. ఇందులో 30 ఏనుగులతో రానా నటించారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు కష్టపడి చేసిన చిత్రమిది. స్సాంలోని నిజ ఘ‌ట‌న‌ల‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. జాద‌వ్ ప్రియాంక్ అనే వ్య‌క్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించినట్లు ఇది వరకే చిత్ర యూనిట్‌ తెలియజేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.