యుద్ధానికి మేం 'రెఢీ'.. భారత్‌‌కు పాక్ వార్నింగ్

  • IndiaGlitz, [Tuesday,February 19 2019]

పుల్వామా దాడి ఘటన అనంతరం ఫస్ట్ మీడియా ముందుకు వచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొసలి కన్నీరు కార్చారు. అదేదో సామెత ఉంది కదా.. చావు చెబితే.... ఇంకోదానికి వచ్చినట్లుగా దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత పాక్ ప్రధాని మీడియా ముందుకు రావడం గమనార్హం. ఉగ్రదాడితో తమకెలాంటి సంబంధం లేదని.. ఈ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తే లేదని.. మేం కూడా ఉగ్రమూకల బాధితులమేనన్నారు.

మేం కూడా సిద్ధమే..

పుల్వామా ఉగ్రదాడి విషయంలో భారత్ మాపై అసత్య ప్రచారం చేస్తోంది. పాక్ ప్రభుత్వం గానీ, ఆర్మీ గానీ ఉగ్రవాదులకు మద్దతిచ్చే ప్రసక్తే లేదు. పాకిస్థాన్ కూడా ఉగ్రదాడులతో సతమతమవుతోందన్న సంగతి ప్రపంచం గుర్తించాలి. భారత్ మాపై ఆరోపణలు చేయడం మానాలి. ఉగ్రదాడిపై ఆధారాలు చూపితే ఏమైనా చర్యలు తీసుకుంటాము. అలా కాదని మాపై దాడికి దిగితే మాత్రం ధీటైన సమాధానం చెప్పేందుకు పాక్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది అని భారత్‌‌కు ఇమ్రాన్ హెచ్చరికలు జారీచేశారు.

తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో..!

అయినా ఓ దేశం ఇలా చేసింది.. అలా చేసిందని మరో దేశం ఎలా చెప్పగలుగుతుంది?. ఓ జాతి మీద, ఓ దేశం మీద అన్యాయంగా ముద్ర వేస్తారా?. ఇలాంటి దాడిని పాకిస్థాన్ ప్రతిఘటిస్తుంది?. ఇండియా వైపు నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ తిప్పికొడుతుంది. యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం తేలికే కానీ ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోండి. దాడి చేస్తారా.. అయితే మేమూ సిద్ధమే. యుద్ధం ప్రారంభించడం మీ చేతుల్లో ఉండొచ్చని, కానీ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు అని ఒకింత రెచ్చగొట్టేలా పాక్ ప్రధాని వ్యాఖ్యలు చేయడంతో ఇండియన్ ఆర్మీ, కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో రగిలిపోతోంది. అయితే పాక్ వ్యాఖ్యలకు భారత ప్రధాని ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

నేనొక ముళ్ల పందిని.. సీక్రెట్స్ అన్నీ చెప్పను: ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్‌‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించిన నాటి నుంచి మూడు గొడవలు..

రిహార్సల్స్ చేస్తూ కుప్పకూలిన విమానాలు

ఏరో ఇండియా ఎక్స్‌‌పో-2019 కోసం బెంగళూరులోని ఎలహంక ఎయిర్‌‌బేస్ వద్ద రిహార్సల్స్ చేస్తుండగా రెండు విమానాలు పరస్పరం ఢీ కొన్ని కుప్పకూలాయి.

ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసిన హరీశ్ రావు

టీఆర్ఎస్ ఉద్దండుడు, గులాబీ బాస్‌‌‌ కేసీఆర్‌కు కట్టప్పలా ఉండే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌ రావుకు మంత్రి పదవి ఇవ్వట్లేదని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

'రాక్ష‌స‌న్'లో రాశీఖ‌న్నా

ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ 'సీత‌' త‌ర్వాత ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ సూప‌ర్‌హిట్ చిత్రం 'రాక్ష‌స‌న్‌' లో రీమేక్‌లో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

తండ్రి పాత్ర‌లో క్రేజీ హీరో...

రీసెంట్ టైంలో వ‌రుస విజ‌యాల‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ హీరో త‌దుప‌రి కె.ఎస్‌.రామారావు