close
Choose your channels

ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసిన హరీశ్ రావు

Tuesday, February 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీఆర్ఎస్ ఉద్దండుడు, గులాబీ బాస్‌‌‌ కేసీఆర్‌కు కట్టప్పలా ఉండే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌ రావుకు మంత్రి పదవి ఇవ్వట్లేదని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయన కాంగ్రెస్, బీజేపీ కీలకనేతలతో టచ్‌‌లో ఉంటూ వారితో ఫోన్‌‌లో మాట్లాడారని.. ఆ రికార్డింగ్స్ మొత్తం కేసీఆర్ తెప్పించుకున్నారని అందుకే హరీశ్‌‌కు మంత్రి పదవి ఇవ్వలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఒక్కసారి కూడా హరీశ్ స్పందించిన దాఖలాల్లేవ్. అయితే మంత్రి వర్గ విస్తరణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తనపై వస్తున్న పుకార్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

నేను సైనికుడు లాంటి కార్యకర్తను..!

" ఇవాళ కొత్తగా మంత్రులుగా పనిచేసిన నేతలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, ఆయన ఆలోచనను అమలు చేసి, ప్రజల ఆకాంక్షలను అమలు చేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా ప్రమాణం చేసిన వారు కేసీఆర్‌‌కు చేదోడు వాదోడుగా ఉండి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. టీఆర్ఎస్‌‌లో నేను క్రమశిక్షణ కలిగిన సైనికుడిలాంటి కార్యకర్తను. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా సామాన్య కార్యకర్తలా తూ.చ తప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికే పదుల సార్లు చెప్పాను" అని హరీశ్ స్పష్టం చేశారు.

నాకెలాంటి బాధలేదు.. సీరియస్‌‌గా తీసుకోవద్దు!

"ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలు, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్‌ ఏర్పాటు చేశారు. నన్ను కేబినెట్‌‌లోకి తీసుకోలేదనే బాధ లేదు. నాపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారం. నాపై ఎలాంటి గ్రూప్స్‌‌గానీ, సేనలు కానీ లేవు. ఇలాంటివి ఎవరైనా పెట్టుకున్నా దయచేసి వాటిని సీరియస్‌‌గా తీసుకోవద్దని మనవి చేస్తున్నాను. అందరూ పార్టీ కోసం, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని హరీశ్ రావు క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి చూస్తే గత కొన్ని రోజులుగా నెలకొన్న పుకార్లకు ఒక్క మాటతో హరీశ్ ఫుల్‌స్టాప్ పెట్టేశారని చెప్పుకోవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.