close
Choose your channels

హరీశ్‌‌కు ఆర్థిక శాఖ.. కేసీఆర్ కుట్ర చేశారా!?

Tuesday, September 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హరీశ్‌‌కు ఆర్థిక శాఖ.. కేసీఆర్ కుట్ర చేశారా!?

కల్వకుంట్ల ఫ్యామిలీకి కట్టప్పగా.. టీఆర్ఎస్ పెద్ద దిక్కుగా.. సీఎం కేసీఆర్‌కు రైట్ హ్యాండ్‌గా ఉన్న తన్నీరు హరీశ్‌రావుకు ఆర్థిక శాఖ కేటాయించడం వెనుక పెనుకుట్ర జరిగిందా..? కేసీఆరే దగ్గరుండి ఇందుకు వ్యూహ రచన చేశారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. అసలు కేసీఆర్‌కు ఎందుకిలా చేశారు..? హరీశ్‌కే ఆర్థిక శాఖ కేటాయించారనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

కేవలం హరీశ్‌ను చూసే..!
తన్నీరు హరీశ్ రావు.. తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్.. జననేతగా పేరుగాంచారన్న విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉందన్నా.. వరుసగా రెండుసార్లు గెలిచి గట్టెక్కిందన్నా కేసీఆర్ కంటే ముందు వినపడే పేరు హరీశ్.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన నగ్నసత్యం. ఎందుకంటే రాష్ట్రంలో ఆయనకుండే ఫాలోయింగ్.. ఫ్యాన్స్ రేంజ్ అలాంటిది మరి. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్, కేటీఆర్‌ల కంటే హరీశ్‌నే చూసి తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారన్నది ఇన్నర్ టాక్.

ఫస్ట్ టెర్మ్‌లో పనులే పనులు!
ఇక అసలు విషయానికొస్తే.. 2014లో ఫస్ట్ టైమ్‌ టీఆర్ఎస్ విజయడంఖా మోగించిన తర్వాత హరీశ్‌ను అందలమెక్కించిన కేసీఆర్ కీలక శాఖ అయిన నీటి పారుదల శాఖ కట్టెబెట్టారు. అయితే ఏ శాఖ కేటాయించిన సమర్థవంతంగా నడపగలిగే దమ్మున్న నేత. ఈయన హయాంలోనే.. తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తయ్యింది. అంతేకాదు ‘మిషన్ భగీరథ’ అనే కొత్త కార్యక్రమాన్ని పరిచయం చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటి వరకూ అంతా ఓకే.. రెండోసారి ఎన్నికలు వచ్చాయ్.. మళ్లీ టీఆర్ఎస్సే గెలిచింది.. కానీ హరీశ్‌కు సెకండ్ టెర్మ్ నుంచి పెద్దగా కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇందుకు ప్రత్యేకించి కారణాలు మరీ చెప్పనక్కర్లేదు.

దూరం చేయడానికేనా!?
ఇటీవల హరీశ్‌కు కీలక శాఖ అయిన ఆర్థిక శాఖను కేసీఆర్ కేటాయించారు. ఆర్థిక శాఖ కీలకమైన శాఖ అయినప్పటికీ అదేదో సామెతలాగా కేసీఆర్ దీనికే కింగ్.. హరీశ్‌ రబ్బర్ స్టాంప్ అంతే. అంటే.. కేసీఆర్ నంది అంటే నంది అనాలి.. పంది అంటే పంది అనాలంతే అదన్న మాట పరిస్థితి. అయితే హరీశ్‌కు ఈ శాఖ ఇవ్వడం.. కేటీఆర్‌కు మళ్లీ అదే శాఖ కేటాయిచడం వెనుక పెద్ద కుట్రే జరిగిందని రాజకీయ విశ్లేషకులు, హరీశ్ డై హార్డ్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. హరీష్‌రావుకు జననేతగా మంచి పేరుంది.. రాష్ట్ర ప్రజలే కాదు.. ఇప్పుడున్న కేబినెట్ మొదలుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం హరీశ్‌ అంటే పడి చచ్చిపోతారు. అందుకే అటు జనాల్లో ఇటు పార్టీ నేతల్లో హరీశ్‌ క్రేజ్‌ను తగ్గించాలనే పక్కా ప్లాన్‌తో హరీశ్‌కు ఆర్థిక శాఖ ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మొత్తమ్మీద చూస్తే.. హరీశ్‌ను కేసీఆర్ తొక్కేయలనే ఉద్దేశంతో ఇలా మాస్టర్ ప్లాన్ వేశారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో..? హరీశ్ ఏ మాత్రం కేసీఆర్ ఉచ్చు నుంచి తప్పించుకుంటారో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.