ఆర్జీవీ భావోద్వేగ ట్వీట్.. !

  • IndiaGlitz, [Saturday,February 01 2020]

సంచలనాల దర్శకుడు ఆర్జీవీ .. ఓ ఎమోషనల్ స్క్రిప్టును ఎంచుకున్నారు. యథార్థ కథాంశాలతో సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ... తెలుగు నాట సంచలనం సృష్టించిన దిశ ఘటనపై సినిమా తీస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించి వరుసపెట్టి ట్వీట్స్ చేసిన ఆయన.. దిశ ఘటన తాలూకా ఫొటోలను అప్‌లోడ్ చేశారు. అంతేగాక భావోద్వేగ ట్వీట్ కూడా చేశారు. అత్యాచార నిందితులు తెలుసుకునేలా ఓ భయంకర గుణపాఠాన్ని ఈ సినిమా ద్వారా నేర్పబోతున్నామంటూ ఆర్జీవీ తెలిపారు.
 
అంతకుముందు నిర్భయ నిందితుల ఉరిపై ట్వీట్ చేసిన వర్మ.. నాడు క్రూర మృగాల చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురైన నిర్భయ.. ఇవాళ మన సిస్టమ్ చేతిలో అత్యాచారానికి గురవుతోందని వ్యాఖ్యానించారు. నిర్భయ తల్లిదండ్రుల ఫీలింగ్స్‌ని ఊహించగలరా మోదీ గారూ అన్న వర్మ.. నిర్భయను చంపేసిన నిందితులను శిక్షించేందుకు కోర్టులన్నీ ఎలా కింద మీదా పడుతున్నాయో చూడండంటూ ట్వీట్ చేశారు.

More News

ముంబై టూ హైదరాబాద్.. ‘హారన్’ మోగిస్తే అంతే!

భారతదేశంలో అత్యంత రద్దీగల ప్రాంతాల్లో ముంబై మొదటి వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక రాజధానిలో ఎంతమంది వాహనాలు వాడుతున్నారో.. దానివల్ల ఎంతెంత కాలుష్యం అవుతోందో లెక్కలేదు.

బడ్జెట్‌-2020తో తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేంటి!?

కేంద్ర బడ్జెట్-2020లో తెలుగు రాష్ట్రాలకు ప్రకటించిందేమీ లేదు. స్మార్ట్ సిటిలు, రైల్వే లైన్ల సంఖ్య మాత్రమే చెప్పగా వాటిలో తెలుగు రాష్ట్రాలకు కూడా ఉంటాయని అనుకుంటున్నారే తప్ప..

కేంద్ర బడ్జెట్ 2020: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..!

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2020ను ఇవాళ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కేంద్ర బడ్జెట్‌ వల్ల సామాన్యుడికి ఏదో ఒకరుగుతుందనుకుంటే తీరా చూస్తే ఆశించినంతగా కేటాయింపులు లేవు.

ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది

బడ్జెట్ 2020 ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లోనే డిగ్రీ కోర్సులు!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌-2020 వల్ల రైతులకు, విద్యారంగాలకు మాత్రం న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. అందేకే ఈ రెండు రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.