చంద్ర మోహన్ చనిపోయారంటూ రూమర్స్.. ఇదీ అసలు సంగతి

  • IndiaGlitz, [Tuesday,May 25 2021]

సీనియర్ నటుడు చంద్రమోహన్ చనిపోయారా ? ఈ అనుమానమే టాలీవుడ్ మొత్తాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. మొన్ననే అంటే మే 23న చంద్రమోహన్ 81 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అంతలోనే చంద్రమోహన్ ఇక లేరు అంటూ కొన్ని మీడియా సంస్థల్లో పుకార్లు పుట్టేశాయి. చంద్ర మోహన్ చనిపోయారని వస్తున్న వార్తలు అవాస్తవం. అయినా ఈ పుకారు ఎందుకు సృష్టించారు అని ఆరా తీయగా ఓ విషయం బయటపడింది.

చంద్రమోహన్ తన బర్త్ డే రోజున ఓ ప్రకటన చేశారు. ఇక సినిమాలు చేయనని, రిటైర్మెంట్ ప్రకటించారు. సినిమాలకు ఇక సెలవు అనే వార్త మీడియాల్లో వచ్చింది.

ఇదీ చదవండి: 'కర్ణన్' బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరోతో రొమాన్స్

ఈ న్యూస్ కొందరికి తప్పుగా అర్థం అయింది. సినిమాలకు సెలవు అంటే..చంద్రమోహన్ ఇక సెలవు..ఆయన ఇక లేరు అనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది అసలు మ్యాటర్. అంతే కానీ ఆయన చనిపోలేదు.

ప్రస్తుతం చంద్రమోహన్ కు ఆరోగ్యం సహకరించడం లేదు. రాఖీ టైమ్ లోనే ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతూనే ఉంది. బన్నీ డీజే షూటింగ్ లో కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. తన సమస్యల వల్ల నిర్మాతలని ఇబ్బంది పెట్టకూడదని చంద్రమోహన్ ఈ డెసిషన్ తీసుకున్నారు.

చంద్రమోహన్ గత 55 ఏళ్లుగా తన నటనతో మెప్పిస్తున్నారు. 1966 లో రంగులరాట్నం మొదలుకుని ఇటీవల డీజే, గౌతమ్ నంద వరకు నటిస్తూనే ఉన్నారు.

More News

గుడ్ న్యూసే.. కానీ స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్

కొన్ని రోజుల క్రితం తాను కోవిడ్ బారీన పడ్డట్లు ఎన్టీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐసొలేషన్ లో ఉంటున్న తారక్ డాక్టర్ల సలహాలు పాటిస్తూ చికిత్స చేయించుకుంటున్నాడు.

'కర్ణన్' బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరోతో రొమాన్స్

ధనుష్ హీరోగా నటించిన ' కర్ణన్' చిత్రం ప్రస్తుతం సౌత్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. సామాజిక అణచివేత పై గతంలో అనేక చిత్రాలు వచ్చాయి. సహజసిద్ధమైన హావభావాలతో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచింది.

కొరియన్ పిల్లతో కాదా.. మళ్ళీ ఆమెతోనే రాంచరణ్ రొమాన్స్ ?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తదుపరి చిత్రాలు లైనప్ ఆసక్తికరంగా ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కే చిత్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

బ్రదర్స్ డే : సింగిల్ ఫ్రేమ్ లో మెగా బ్రదర్స్.. చిరు కామెంట్

మెగాస్టార్ చిరంజీవి లేటుగా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. అయితేనేం.. కుర్రాళ్లకు తగ్గకుండా సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతున్నారు. సామజిక మాధ్యమాల్లో చిరు చాలా యాక్టివ్ గా

వకీల్ సాబ్ : మతిపోగొడుతున్న నెల్లూరు కుర్రాళ్లు.. తమన్ ఫిదా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పింక్ రీమేక్ అయినప్పటికీ దర్శకుడు వేణు శ్రీరామ్