close
Choose your channels

బ్రదర్స్ డే : సింగిల్ ఫ్రేమ్ లో మెగా బ్రదర్స్.. చిరు కామెంట్

Tuesday, May 25, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ్రదర్స్ డే : సింగిల్ ఫ్రేమ్ లో మెగా బ్రదర్స్.. చిరు కామెంట్

మెగాస్టార్ చిరంజీవి లేటుగా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. అయితేనేం.. కుర్రాళ్లకు తగ్గకుండా సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతున్నారు. సామజిక మాధ్యమాల్లో చిరు చాలా యాక్టివ్ గా ఉంటూ అన్ని విశేషాలని అభిమానులతో పంచుకుంటున్నారు. నేడు సోమవారం బ్రదర్స్ డే సందర్భంగా చిరు ఓ అరుదైన పిక్ ని షేర్ చేశారు.

ఈ పిక్ లో మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ ఉన్నారు. చిన్నతనంలో ముగ్గురూ క్యూట్ గా కనిపిస్తున్నారు. ఈ పిక్ లో చిరు పవన్ ని ఎత్తుకుని ఉండడం విశేషం. 'తోడ పుట్టిన బ్రదర్స్ కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే' అని చిరు పెట్టిన కామెంట్ ఆకట్టుకుంటోంది.

సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం కొరటాల దర్శత్వంలో 'ఆచార్య'లో నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఈపాటికే ఆచార్య హంగామా థియేటర్స్ లో మొదలైపోయి ఉండాలి. కరోనా కారణంగా ఆచార్య టీం ప్లాన్స్ అన్నీ నాశనం అయ్యాయి. కరోనా ప్రభావం తగ్గేవరకూ అభిమానులకు ఎదురుచూపులు తప్పవు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos